ఎప్పుడెప్పుడా అని మెగాభిమానులు ఎదరుచూస్తున్న కొత్త సినిమా లుక్ టెస్ట్ పూర్తయ్యిందని సమాచారం. కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్‌ను కలగలిపి సినిమాలు చేయడంలో దిట్ట అయిన దర్శకుడు కొరటాల శివ .. భరత్ అనే నేను సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేయడానికి ఓకే చేశాడు. అయితే చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి పూర్తి కాకపోవడంతో చిరు, కొరటాల శివ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. మరో రెండు నెలల్లో సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో చిరు, కొరటాల సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం అందుకున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం రీసెంట్గా చిరంజీవి లుక్ టెస్ట్ పూర్తి చేసి ఫోటో షూట్ కూడా చేయించారట దర్శకుడు కొరటాల శివ. ఈ చిత్రంలో చిరంజీవి రైతు పాత్రలో కనిపిస్తాడట. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి. రామ్‌చరణ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోబోతున్నారు.
previous post
next post