అధికారిక అనుమతి లేకపోవడంతో జూనియర్ ఎన్.టి.ఆర్ యొక్క బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దు చేయబడింది.
సుమారు 1.5 కోట్లు ఖర్చు పెట్టె ప్రణాళికతో వైభవంగా జరగాల్సిన జూనియర్ ఎన్.టి.ఆర్ యొక్క బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దు చేయబడింది. అలియాభట్ మరియు రన్బీర్ కపూర్ ప్రముఖ నటులుగా భారీ బడ్జెట్ తో త్వరలో రాబోతున్న బ్రహ్మాస్త్ర సినిమా కోసం ప్రమోషన్స్ కి జూనియర్ ఎన్.టి.ఆర్ ఒప్పుకున్న విషయం తెలిసిందే. కానీ అనుకున్న ప్రకారం రామోజీ ఫిలిం సిటీ లో జరగాల్సిన ఈ ఈవెంట్ ని చివరి నిమిషం లో రద్దు చేస్తున్నట్లు ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రకటించారు. ఈ విషయం పట్ల జూనియర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ ఎన్.టి.ఆర్ స్పందన పై న్యూస్ ఆర్బిట్ స్పష్టత
జూనియర్ ఎన్.టి.ఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈవెంట్ ఆర్గనైజర్స్ తక్షణమే క్షమాపణ చెప్పాలి అని కోరుతున్నారు. జూనియర్ ఎన్.టి.ఆర్ అభిమాని ట్విట్టర్ లో చేసిన ట్వీట్ వైరల్ అయివుతుంది.
ఇదే ఆ ట్వీట్
“క్షేమంగా వెనక్కి రండి @tarak9999 అభిమానులు! ప్రొడక్షన్ హౌస్ మరియు ఈవెంట్ నిర్వాహకుల నుండి మాకు అధికారిక క్షమాపణలు కావాలి”
అయితే ఇది జూనియర్ ఎన్.టి.ఆర్ చేసిన ట్వీట్ కాదు. ఇది కేవలం ఒక అభిమాని చేసిన ట్వీట్.
చివరి నిమిషంలో రద్దు చేయడానికి కారణం
ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ మరియు హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్స్ ఆధారంగా ఈవెంట్ రద్దు చేయడానికి కారణం అధికారిక అనుమతి లేకపోవడం – “అధికారిక అనుమతి లేకపోవడంతో జూనియర్ ఎన్.టి.ఆర్ యొక్క బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్ చివరి నిమిషంలో రద్దు చేయబడింది.”
అయితే నెటిజన్స్ మాత్రం ఇది కేవలం గుడ్డి సాకు మాత్రమె అంటున్నారు. అసలు జూనియర్ ఎన్.టి.ఆర్ యొక్క బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్ ఆడియన్స్ లేరు అని, ఎవరు రాకపోవటం తో చివరి నిమిషంలో రద్దు చేయాల్సి వొచింది అని ఊహాగానాలు.
ప్రెస్ మీట్ లో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏం చెప్పారు
జూనియర్ ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ముందుగా తన అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేమని డిపార్ట్మెంట్ ఆఖరి క్షణంలో తీసుకున్న నిర్ణయంతో.. జరగాల్సిన భారీ ఈవెంట్ ఆగిపోయినట్లు స్పష్టం చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ మరియు బ్రహ్మాస్త్ర సినిమాపై మరిన్ని కథలను చదవండి
Brahmastra: బ్రహ్మాస్త్ర ఈవెంట్ లో ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
Brahmastra: తెలుగు లో తన ఫేవరెట్ యాక్టర్ ఎవరో చెప్పేసిన రణబీర్ కపూర్..!!