సినిమా

Naga Chaitanya: త్వ‌ర‌లోనే నాగ చైత‌న్య రెండో పెళ్లి.. ఇదిగో క్లారిటీ..!

Samantha silent on divorce after accusations
Share

Naga Chaitanya: యువ‌సామ్రాట్ నాగ చైత‌న్య ఇటీవ‌లె భార్య, ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత నుంచి స‌ప‌రేట్ అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట‌.. ఆపై పెద్ద‌ల‌ను ఒప్పించి గోవాలో రెండు సంప్ర‌దాల ప్ర‌కారం వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. కానీ, ఏమైందో ఏమో కానీ.. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట చివ‌రాఖ‌ర‌కు విడాకులు వైపు ట‌ర్న్ తీసుకున్నారు.

వీడి విడిపోయి ఇప్ప‌టికే ఆరేడు నెల‌లు కావొస్తోంది. ప్ర‌స్తుతం ఎవ‌రి లైఫ్‌తో వారు బిజీ అయిపోయారు. అయితే గ‌త కొద్ది రోజుల నుంచీ చైతుకు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే.. చైతు ఒంట‌రిత‌నాన్ని చూడ‌లేక‌పోతున్న‌ నాగార్జున అత‌డికి రెండో పెళ్లి చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌.

అందులో భాగంగానే ఓ హీరోయిన్‌తో చైతు రెండో వివాహం చేసేందుకు నిశ్చ‌యించార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంపై నాగ‌చైత‌న్య టీమ్ క్లారిటీ ఇచ్చిన‌ట్లు టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాని ప్ర‌కారం సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న‌ వార్త‌లు కేవ‌లం పుకార్లే అని.. అస‌లింత‌కీ నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల‌కు సంబంధించిన చ‌ట్ట‌ప‌ర‌మైన ఫార్మాలిటీస్ పూర్తి కాలేద‌ని అంటున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో చైతు రెండు పెళ్లి చేసుకోవ‌చ్చు అసాధ్య‌మ‌ని చెబుతున్నారు. కాగా, చైతు సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన `థ్యాంక్యూ` చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా. అలాగే థ్యాంక్యూను తెర‌కెక్కించిన విక్ర‌మ్ కె కుమార్‌తోనే `ధూత‌` అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.


Share

Related posts

ర‌ష్మిక అల‌క‌

Siva Prasad

Preity Zinta: సరోగసితో తల్లి అయిన ప్రీతి జింటా.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..

Ram

Senior Heroines: ఫేడవుట్ అవకుండా సత్తా చాటుతున్న సీనియర్ హీరోయిన్స్.

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar