మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో గొడవలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. ఓ ప్యానెల్‌కు చెందిన నరేశ్, జీవిత, రాజశేఖర్‌లు రెండు వర్గాలుగా విడిపోయారు. మేమంతా ఒకటేనని అంటున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అలా కనపడటం లేదు. రెండు వర్గాల మధ్య గట్టి గొడవలే జరుగుతున్నాయి. జనరల్ బాడీ మీటింగ్‌కు హాజరు కావాలని సెక్రటరీ జీవిత, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్ ముందు సభ్యులకు చెప్పారు. దీన్ని నరేశ్ వర్గం ఖండించింది. ప్రెసిడెంట్ లేకుండా జనరల్ బాడీ మీటింగ్ ఏంటి? అని ప్రశ్న రావడంతో లేదు ఇది జనరల్ మీటింగేనని అందరినీ పిలుచుకున్నారు. అయితే రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి సభ్యులు మీటింగ్ నుండి వాకౌట్ చేశారు. పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకుని వెళ్లిపోయారని సమాచారం.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!