Celebrity classmates: సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సెలబ్రిటీలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు.అయితే వారు అభిమానించే సెలబ్రిటీల గురించి ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఎంతో ఉత్సాహపడుతుంటారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నటీనటులు వారి వ్యక్తిగత విషయాలను ఏదో ఒక సందర్భంలో తెలియజేస్తుంటారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా గుర్తింపు సంపాదించుకున్న వారు ఒకప్పుడు ఒకే స్కూల్లో, ఓకే క్లాసులో చదువుకున్న వారు ఉన్నారు.
ప్రస్తుతం ఈ కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరికీ తెలియని విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే చిన్నప్పుడు ఒకే స్కూల్లో, ఓకే తరగతిలో చదువుకున్న వీళ్లు.. ప్రస్తుతం స్టార్ సెలబ్రెటీలుగా గుర్తింపు సంపాదించుకున్నారనే విషయం కూడా సోషల్ మీడియా ద్వారానే తెలిసింది.ఇంతకీ అప్పటి క్లాస్ మేట్స్.. ఇప్పటి సెలబ్రెటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
క్లాస్ మేట్స్.. సెలబ్రిటీస్:
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా వారసుడుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, రానా దగ్గుపాటి చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నారని ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు. అదేవిధంగా నాచురల్ స్టార్ నాని, బుల్లితెర పై ప్రముఖ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ ఇద్దరు హైదరాబాద్ లో ‘సెంట్ అల్ఫోన్సా’ స్కూల్లో చదువుకున్నారని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఇకపోతే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇండియన్ క్రికెటర్ ధోనీ భార్య సాక్షి ధోని అస్సాంలో ఒకే స్కూల్లో ఓకే క్లాస్ లో కలిసి చదువుకున్నారట. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఓకే క్లాసులో చదువుకున్నారట. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తలైనా ముఖేష్ అంబానీ,ఆనంద్ మహేంద్ర కూడా చిన్నప్పుడు ఒకే స్కూల్ ఒకే తరగతి లోనే చదువుకున్నారని తెలుస్తోంది