Categories: సినిమా

cm jagan-chiranjeevi: చిరంజీవి క‌లిసి వెళ్లిన మూడు గంట‌ల్లో సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

Share

cm jagan-chiranjeevi: గ‌త కొద్ది రోజుల క్రితం ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్‌ రేట్ల‌ను తగ్గిస్తూ జీవో 35 తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్నింటికీ ఒకే ధరను నిర్ణయిస్తూ ఈ జీవోను జారీ చేయ‌గా.. టాలీవుడ్‌లో పిడుగు ప‌డిన‌ట్టైంది. అప్ప‌టి నుంచీ సినిమా టికెట్ ధ‌ర‌ల విష‌యంలో టాలీవుడ్‌కి, ఏపీ ప్రభుత్వానికి మ‌ధ్య కోల్డ్ వార్ కొన‌సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ వార్‌కి పులిస్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగానే.. నేడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. గురువారం మధ్యాహం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి.. మొద‌ట ఆయ‌న‌తో క‌లిసి భోజనం చేశారు. ఆ త‌ర్వాత గంట‌న్న‌ర పాటు సినీ సమస్యలు, టికెట్ ధరలపై వీరు చర్చించుకున్నారు. భేటీ అనంతరం చిరంజీవి మీడియాలో మాట్లాడుతూ.. పరిశ్రమ పెద్దగా తాను సీఎం జ‌గ‌న్‌ని కలిసానని, పండగ పూట సీఎంతో ఆనందకర భేటీ జరిగిందని తెలిపారు.

`ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధలు సీఎంకు వివరించాను. నేను చెప్పిన అన్ని విషయాలను సీఎం సానుకూలంగా ఆలకించారు. ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి నోరు జారొద్ద‌ని కోరుతున్నా. త్వ‌ర‌లోనే అంద‌రూ ఆనందించే నిర్ణ‌యం ప్ర‌భుత్వం నుంచి వ‌స్తుంది` అంటూ చిరంజీవి తెలిపారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. చిరంజీవి క‌లిసి వెళ్లిన మూడో గంట‌ల‌కే జ‌గ‌న్ అర్జెంట్ రివ్యూ మీటింగ్‌ను ఏర్పాటు చేశార‌ట‌. ఈ మీటింగ్‌లో జ‌గ‌న్ జీవో 35ను స‌వ‌రించాల‌ని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అలాగే రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

 


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

44 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago