కొరియోగ్రాఫర్‌గా కెరియర్ ప్రారంభించి.. అనంతరం పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమ్మ రాజశేఖర్. టాలీవుడ్ ప్రముఖ నటుడు గోపించంద్ను హీరోగా పెట్టి “రణం” సీనిమాను తీసి దర్శకుడిగా మారారు. రవితేజతో ఖతర్నాక్, నితిన్‌తో టక్కరి సినిమాలను తీసి డైరెక్టర్‌గానూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మంచి గుర్తింపుతో పాటు పలు వివాదలకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా మారారు. దీంతో బాగానే పాపులారిటీని సైతం దక్కించుకున్నారు. ఇటీవల ప్రారంభమైన బిగ్‌బాస్ తాజా సీజన్లోనూ అడుగుపెట్టి.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు.
అయితే, సినీ పరిశ్రమకు చెందిన వారంటేనే నిత్యం వారిపై ప్రశంసలతో పాటు విమర్శలు, వివాదాలు సైతం వస్తూనే ఉంటాయి. తాజగా అమ్మ రాజశేఖర్‌పై గతంలో ఓ బల్లితెర నటుడు, కమెడియన్ చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “అమ్మ రాజశేఖర్ నన్ను వాడుకుని.. వదిలేశాడు” అని సంచలన కామెంట్స్ చేసిన ఆ బుల్లితెర నటుడు, మెడియన్ ఎవరో కాదు.. జబర్ధస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ వేస్తూ తన అభినయంతో అదరగొట్టి పాపులర్ అయిన పవన్. అదేనండీ చీరకట్టుతో చుక్కల్లో చందమామలా మెరిసిపోయే మన పావనీ !
“జబర్ధస్త్” టెలివిజన్ రంగంలో తిరుగులేని కామెడీ షో.. ఇందులో పాల్గొంటున్న అనేక మంది నటీనటులు.. సినీ ఇండస్ట్రీకి కొత్తగా వస్తున్న తరుణంతో ఎన్నో ఇబ్బందులు, కష్టనష్టాలను చవిచూశారు. అలాంటి వారిలో పవన్ కూడా ఒకరు. జబర్ధస్త్ కు రాకముందు పవన్ డాన్సర్‌గా పనిచేశాడు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వూలో సంచలన విషయాలు వెల్లడించాడు. హైదరాబాద్‌కు మొదట వచ్చినప్పుడు తినడానికి తిండి లేని రోజులు గడిపాననీ, అలాంటి సమయంలో లేడీ గెటప్స్ వేస్తూ డబ్బులు సంపాదించానని చెప్పుకొచ్చారు.
ఆలాంటి తరుణంలోనే అమ్మ రాజశేఖర్ తనకు పరిచయమయ్యారనీ, అప్పుడే తన దగ్గర డాన్స్ అసిస్టెంట్‌గా చేరాననీ, ఆ సమయంలో ఆయన బట్టలు ఉతకడం, అంట్లు తోమడంతో పాటు అన్నీ పనులు చేసిపెట్టానని తెలిపారు. ‘ఇవన్నీ అవకాశాల కోసమేననీ, తనకు ఖతర్నాక్ సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి.. ఇవ్వలేదు. ఆ తర్వాత టక్కరి సీనిమాలో అవకాశం ఇస్తాడని అనుకున్నాను.. కానీ తన అవసరాల కోసం పూర్తిగా వాడుకొని వదిలేశాడని చెప్పాడు. దీనికి తోడు నీ మొహం ఎప్పుడైన అద్దంలో చూసుకున్నావా.. ! అంటూ వెక్కిరించాడని.. అప్పుడే ఆయన నుంచి దూరంగా వచ్చేశానని’ తెలిపాడు. ఈ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొని జబర్ధస్త్ లో అవకాశం దక్కించుకున్నానని వెల్లడించాడు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!