Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మామూలుగానే బయట పవన్ కి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సినిమా చేసినా చేయకపోయినా వ్యక్తిత్వ పరంగా కొన్ని దశాబ్దాల కాలం నుండి యువతను ప్రభావితం చేసే హీరోగా… టాలీవుడ్ ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో కూడా ఆయనకి చాలా మంది అభిమానులు ఉన్నాగాని ఆయనతో కలిసిన సందర్భాలు కొంతమందికే దక్కాయి. ఈ క్రమంలో తాజాగా కమెడియన్ ప్రియదర్శి కి అవకాశం దక్కింది. తాజాగా కమెడియన్ ప్రియదర్శి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సారథి స్టూడియోలో కలిశారు. డైరెక్టర్ హరీష్ శంకర్ మూలంగా పవన్ కళ్యాణ్ నీ కలిసిన కమెడియన్ ప్రియదర్శి ఆనందానికి అవధులు లేవు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “ఎప్పటిలాగా సారథి స్టూడియోలో షూటింగ్ కి వెళ్లాను. అయితే ఆ రోజు మాత్రం ఎప్పటి లాగా లేదు. ఎటు చూసినా హడావిడి. అందరి కళ్ళలో ఏదో సందడి. అందరి నోట ఒకే మాట పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అంతే.. వారితో ఒక మాట అయినా మాట్లాడాలి. వారు తీసిన చిత్రం “జానీ” ఎంతగా నచ్చిందో చెప్పడానికి ఈ రోజంతా ఎదురు చూశాను. డైరెక్టర్ హరీష్ శంకర్ అన్న వాళ్ళ కోరిక తీరింది.
నీకు ప్రత్యేక కృతజ్ఞతలు హరీష్ అన్న. కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడటం ఒక మర్చిపోలేని అనుభూతి అని.. కమెడియన్ ప్రియదర్శి సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ఫోటోలను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం పవన్కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం లో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే హరీష్ శంకర్ ప్రాజెక్టు భవదీయుడు భగత్ సింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు సారథి స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ క్రమం లో పవన్ కళ్యాణ్ ని ప్రియదర్శి కలవడం జరిగింది.