23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

Sunil: తమిళ ఇండస్ట్రీలోకి కొత్త తరహాలో ఎంట్రీ ఇవ్వబోతున్న సునీల్..?

Share

Sunil: నటుడు సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరో, కమెడియన్ మరియు విలన్ ఇంకా క్యారెక్టర్ సపోర్ట్ ఆర్టిస్ట్ గా అనేక రకాలుగా ప్రేక్షకులను అలరించాడు. అన్నిటిలో కంటే కమెడియన్ గా సునీల్ మంచి క్రేజ్ సంపాదించడం జరిగింది. కమెడియన్ గా మంచి అవకాశాలు వస్తున్న సమయంలో హీరోగా సునీల్ చేసిన ప్రయత్నం అతని కెరియర్ ని ఇబ్బందుల్లోకి నెట్టింది. హీరోగా ప్రారంభంలో రెండు మూడు ఇట్లు పడిన తర్వాత మాత్రం వరుస పరాజయాలు ఎదురయ్యాయి.

comedian sunil become villain in tamil industry
Sunil

దీంతో మళ్లీ కమెడియన్ గా ఇప్పుడు సినిమాలు చేస్తూ ఉన్నారు. క్యారెక్టర్ సపోర్ట్ పాత్రలు కూడా చేస్తున్నారు. ఇటీవలే చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” లో కూడా ఇదే తరహా పాత్రలో సునీల్ కనిపించడం జరిగింది. ఇంకా అడపాదడబా కొన్ని సినిమాలలో విలన్ పాత్రలు చేయడం జరిగింది.  ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ లోకి సునీల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. “డిస్కో రాజా” సినిమాలో మొదటి సారి విలన్ పాత్రలో కనిపించిన సునీల్ తర్వాత “కలర్ ఫోటో” లో నెగిటివ్ రోల్ చేశాడు. గత ఏడాది “పుష్ప” లో కూడా విలన్ పాత్రలో సునీల్ కనిపించడం జరిగింది.

comedian sunil become villain in tamil industry
Sunil

కమెడియన్ తరహాలోనే విలన్ పాత్రలో సునీల్ క్రేజ్ ఉన్న కొద్ది పెరుగుతుంది. పైగా “పుష్ప” పాన్ ఇండియా స్థాయిలో… రిలీజ్ అయి విజయం సాధించటంతో … సునీల్ కి మిగతా ఇండస్ట్రీలో కూడా గుర్తింపు లభించింది.  ఈ క్రమంలో తమిళ ఇండస్ట్రీలో విలన్ పాత్రలో సునీల్ ఎంట్రీ అవటానికి రెడీ అయినట్లు సమాచారం. తమిళ ఇండస్ట్రీలో కార్తీ హీరోగా తెరకెక్కబోయే “సుల్తాన్” సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో సునీల్.. కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు ప్రచారం జరుగుతుంది.


Share

Related posts

MaheshBabu – Trivikram: మహేష్ సినిమాకు త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!!

bharani jella

ఏ వయసులో అయినా రమ్యకృష్ణ స్పీడ్ తగ్గించేది లేదు…. ఇంతకీ ఈ ఫోటో చూశారా?

arun kanna

Balakrishna: స్పీడ్ పెంచిన బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ తోనే మరో ప్రాజెక్ట్…??

sekhar