suma kanakala: బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న వారిలో సుమ కనకాల ఒకరు. బుల్లితెరపై సుమకి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిజానికి సుమ కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగు ఎంతో అనర్గళంగా మాట్లాడుతూ యాంకరింగ్ లో తనకు ఎవరు సాటిరారని నిరూపించుకుంది.ఏ టీవీ కార్యక్రమంలో నైనా సుమ కనకాల మనకు దర్శనమిస్తారు. ఆ కార్యక్రమాలలో సుమ చేసే సందడి అందరి పై వేసే పంచులు అందరినీ ఆకట్టుకుంటాయి.కేవలం బుల్లితెరపై కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ అయినా, అవార్డ్ ఫంక్షన్ అయినా సుమ కచ్చితంగా ఆ ప్రోగ్రామ్ లో సందడి చేస్తూ కనిపిస్తారు.
ఈమెకు ఉన్న ఫాలోయింగ్ కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, ఇతర దేశాలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పలు టీవీ కార్యక్రమాలు, షోలకు యాంకరింగ్ చేస్తున్న సుమ స్టార్ హీరోయిన్ల కన్నా ఎక్కువ సంపాదిస్తున్ననడంలో అతిశయోక్తి లేదు. సుమ వయసు 50 సంవత్సరాలకు చేరువవస్తున్న ఆమెలో ఏమాత్రం ఎనర్జీ లెవెల్స్ తగ్గలేదని చెప్పవచ్చు. అదే చురుకుదనం, అదే మాట తీరుతో ప్రేక్షకులను సందడి చేస్తూ కనిపిస్తారు.
కమెడియన్ వెన్నెల కిషోర్:
యాంకర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుమ ఆదివారం నితిన్ కీర్తి, సురేష్ జంటగా నటించిన “రంగ్ దే” ప్రీ రిలీజ్ వేడుకలో యాంకర్ గా పాల్గొన్నారు. ఈ వేడుకను హైదరాబాద్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో కూడా సుమ చమత్కారాలు చేస్తూ అందరిని ఆట పట్టించారు. ఇక వెన్నెల కిషోర్ మాట్లాడుతూ… సుమ గారు మీరు కొత్త విల్లాను కొన్నారట కదా. దానికి టైల్స్ పని జరుగుతుందట కదా అంటూ అసలు విషయాన్ని లీక్ చేశాడు. వెన్నెల కిషోర్ ఒక్కసారిగా ఈ విధంగా అడగడంతో సుమ ఎంతో షాక్ కి గురయ్యారు.ఈ మాట విన్న సుమ ఎక్కడ.. ఎవరు చెప్పారు అంటూ సమాధానం ఇచ్చింది. ఈ విధంగా వెన్నెల కిషోర్ సినిమాలలో మాత్రమే కాకుండా బయట కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తూ అందరినీ ఆట పట్టించారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!