33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Vennela Kishore: కమలహాసన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన కమెడియన్ వెన్నెల కిషోర్..!!

Share

Vennela Kishore: స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ .. కమల్ హాసన్ నటించిన “ఇండియన్ 2” సినిమాలో నటిస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అది కూడా విలన్ పాత్రలో… చేస్తున్నట్లు వార్తలు అయ్యాయి. దీంతో తనపై వస్తున్నా వార్తలు విషయంలో వెన్నెల కిషోర్ క్లారిటీ ఇచ్చారు. “ఇండియన్ 2” లో లేను “పాకిస్తాన్ 3″లో కూడా లేను అనీ పేర్కొన్నారు. సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ చెన్నైలో శరవేగంగా జరుగుతుంది. అంతేకాదు ఈ సినిమాలో ఏడుగురు విలన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది.

Comedian Vennela Kishore gave clarity on Kamala Haasan's movie

ఆ విలన్ పాత్రలలో వెన్నెల కిషోర్ ఒకటని వార్తలు రావడంతో వాటిలో వాస్తవం లేదని ఫన్నీగా స్పందించారు. ఇదిలా ఉంటే “ఇండియన్ 2” సినిమా షూటింగ్ దాదాపు నాలుగు సంవత్సరాలు పై నుండి జరుగుతూ ఉంది. ప్రజల కరోనా రావడంతో రెండు సంవత్సరాలు పాటు మూలన పడింది. అంతకుముందు సినిమా దాదాపు 80% షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే నిర్మాతలతో శంకర్ కి గొడవ రావడంతో కోర్టు దాకా వెళ్ళటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. మొదట అనుకున్న బడ్జెట్ కంటే శంకర్ మరింత ఖర్చు చేయించినట్లు నిర్మాతలు గొడవ పెట్టుకోవడంతో షూటింగ్ మొత్తం ఆపేశారు.

Comedian Vennela Kishore gave clarity on Kamala Haasan's movie

అయితే కమల్ హాసన్ ఇటీవల తాను నటించిన విక్రమ్ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ కావడం మాత్రమే కాదు “బాహుబలి 2” రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించడంతో… “ఇండియన్ 2” కంప్లీట్ అయ్యేలా చొరవ తీసుకున్నారు. నిర్మాతలకు మరియు దర్శకుడు శంకర్ కి మధ్య రాజీ కుదిరిచి ఇప్పుడు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ ఏడాది వేసవిలో సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. దీంతో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ఆపేయడం జరిగింది. ముందు కమల్ సినిమా కంప్లీట్ చేశాకే చరణ్ సినిమా షూటింగ్ కంటిన్యూ చేయటానికి శంకర్ డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ టాక్.


Share

Related posts

Chiranjeevi : చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. రవితేజ ..మేలో పెద్ద రచ్చే ..!

GRK

Sai Pallavi: సినిమాలకు గుడ్ బై చెప్పిన సాయి పల్లవి.. హాస్పటల్ కట్టి డాక్టర్‌గా అవతారం!

Ram

జబర్దస్త్ సెట్ పై ఆమెకి నిజంగానే ముద్దు పెట్టిన కమెడియన్..! ఒక్కసారిగా అంతా షాక్

arun kanna