సినిమా

SVP: ఈ నెల 16వ తారీకు విజయవాడకి మహేష్ బాబు రాక..!!

Share

SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్స్ బ్యాక్ టూ బ్యాక్ సొంతం చేసుకుంటున్నాడు. తాజాగా “సర్కారు వారి పాట”తో మరో బ్లాక్ బస్టర్ మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 12వ తారీకు విడుదల అయ్యి.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ ఎంటర్టైనర్ రూపంలో మెసేజ్ ఓరియంటెడ్ తరహాగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో సినిమాలో సన్నివేశాలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు.

coming to vijayawada mahesh babu for svp success meet

వీకెండ్ కావడంతో.. సినిమా రిలీజ్ అయిన మూడు రోజులకు రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. ఒకపక్క ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరుగుతున్నదని.. సర్కారు వారి పాట నిర్మాణ సంస్థ తెలియజేస్తూ.. అయినా కానీ కలెక్షన్లు ఏ మాత్రం తగ్గటం లేదని సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 16వ తారీకు అనగా సోమవారం విజయవాడలో సిద్ధార్థ గ్రౌండ్స్ లో సినిమా సక్సెస్ మీట్ భారీ ఎత్తున చేయటానికి సినిమా యూనిట్ రెడీ అయింది.

 

దీంతో మహేష్ మే 16 వ తారీకు విజయవాడ రానున్నట్లు వార్తలు వస్తూ ఉండటంతో అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి మహేష్ బాబు వరుస పెట్టి బ్లాక్ బస్టర్ లు సాధిస్తూ ఉండటంతో ఫాన్స్ “సర్కారు వారి పాట” విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. ఇప్పుడు “సర్కారు వారి పాట” తో మరో బ్లాక్ బస్టర్.. ఖాతాలో వేసుకొని బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్లు సాధిస్తున్నాడు.


Share

Related posts

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్.. ‘గబ్బర్ సింగ్’ కు 9 ఏళ్లు

Muraliak

శ్రుతి.. మెడ‌లో పూల‌దండ‌

Siva Prasad

హాలీవుడ్ చిత్రంలో చంద‌మామ‌

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar