తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున మధ్య వున్న స్నేహం గురించి అందరికీ తెసినదే. ఇంతవరకు వీరి సినిమాలు ఒకేసారి బరిలోకి దిగి పోటీపడలేదు. అయితే ఇపుడు అదే పరిస్థితి వచ్చేలా కనబడుతోంది. చిరంజీవి – మోహన్ రాజా కాంబోలో ఓ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఆ సినిమా పేరు ”గాడ్ ఫాదర్”. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’కు అధికారిక తెలుగు రీమేక్ అన్నసంగతి తెలిసినదే. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ”ది ఘోస్ట్”.
మురళీమోహన్‌కు భారీ షాక్ ఇచ్చిన మెగాస్టార్… అసలేం జరిగిందంటే..?
ఇదిగో ట్విస్ట్!
ఇక్కడే వుంది అసలు ట్విస్ట్. మెగాస్టార్ సినిమా దసరా కానుకగా రిలీజు కాబోతుంది. అలాగే కింగ్ నాగార్జున సినిమా కూడా దసరా కానుకగా 2022 అక్టోబర్ 5న సినిమాని రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. దీంతో ‘గాడ్ ఫాదర్’ ‘ఘోస్ట్’ సినిమాల మధ్య పోటీ పడాల్సి వస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న నాగార్జున – చిరంజీవి.. గతంలో పెద్దగా పోటీపడినట్టు దాఖలాలు లేవు. అయితే ఇపుడు ఇలా జరిగింది. ఇదే డౌట్ ని కొంతమంది దగ్గర చెబితే, ఈ రెండు సినిమాల మధ్య కాస్త గ్యాప్ ఉంటుందని చెబుతున్నారు. కానీ అభిమానులు ఒకింత కంగారు పడుతున్నారు.
వారి పాత సినిమాల వ్యత్యాసం ఇదే!
ఇది వరకు వీరు ఒకే తేదీకి సినిమాలు రిలీజ్ కాలేదు కానీ.. ఒకే సీజన్ లో నాలుగైదు రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు కొన్ని సినిమాలు వచ్చాయి. అవేమిటో ఒకసారి చూద్దాము. నాగ్ డెబ్యూ మూవీ ‘విక్రమ్’ మరియు చిరు ‘వేట’ సినిమాలు 5 రోజుల వ్యవధిలో రిలీజు అయ్యాయి. తర్వాత చిరు ‘దొంగ మొగుడు’ – నాగ్ ‘మజ్ను’.. సినిమాలు కూడా అదేవిధంగా రిలీజు అయ్యాయి. అలాగే మెగాస్టార్ ‘రుద్రవీణ’ నాగార్జున ‘ఆఖరి పోరాటం’.. సినిమాలు, అదేవిధంగా ‘మురళీకృష్ణుడు’ – ‘ఖైదీ నెం. 786’.. ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ – ‘విజయ్’.. సినిమాలు రిలీజు అయ్యాయి. ఇపుడు అదే పరంపర వచ్చిందని సినిమా పండితులు అభిప్రాయపడుతున్నారు.