RRR – Radhe shyam: ఈ ఏడాది సంక్రాంతి బరిలో ముందు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటిల భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్. అలాగే వెంకటేశ్ – వరుణ్ తేజ్‌ల ఎఫ్ 3 కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ, అనూహ్యంగా రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ను బరిలో దింపుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు మహేశ్, పవన్ కళ్యాణ్‌లతో మాట్లాడి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ సినిమాలను సంక్రాంతి బరి నుంచి తప్పించారు.
అయితే రాజమౌళి అనుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాపయింది. ఒక్క రాధే శ్యామ్ మాత్రమే ఆర్ఆర్ఆర్ చిత్రానికి పోటీ ఉంది. అయితే అది పీరియాడికల్ లవ్ స్టోరి కాబట్టి అందులోనూ వారం రోజులు ముందు ఆర్ఆర్ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి అంతగా పోటీ ఉండే అవకాశాలు లేవని వసూళ్ళ పరంగా తమదే కొత్త చరిత్ర సృష్ఠిస్తుందని రాజమౌళి బృందం భావించాడు. అందుకే నెలరోజుల ముందు నుంచే ఊహించని విధంగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఒక సినిమా ప్రమోషన్స్‌కు రూ.20 కోట్లు ఖర్చు చేయడం ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు హీరోలతో ప్రమోషన్స్ అంటే మామూలు విషయం కాదు.
RRR – Radhe shyam: జస్ట్ వన్ వీక్ గ్యాప్‌లో ఆర్ఆర్ఆర్ – రాధే శ్యామ్ సినిమాలు రిలీజ్
ఇదంతా కొంత స్వార్దం తోనే రాజమౌళి చేశారను అనుకున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఒమైక్రాన్ దెబ్బతో మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు రాధే శ్యామ్ సినిమాను పోస్ట్‌పోన్ చేయక తప్పలేదు. అయితే మళ్ళీ ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ క్లాష్ కాకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నట్టు ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేసిన మళ్ళీ ఈ రెండు సినిమాల మధ్యనే బాక్సాఫీస్ వార్ ఉంటుందని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి ప్లాన్ చేసినట్టే జస్ట్ వన్ వీక్ గ్యాప్‌లో ఆర్ఆర్ఆర్ – రాధే శ్యామ్ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. చూడాలి మళ్ళీ రీ షెడ్యూల్ చేసి అఫీషియల్ డేట్ కన్ఫర్మ్ చేస్తే గానీ క్లారిటీ రాదు.