Rajnikanth – Ramya Krishna: రజనీకాంత్ పేరు వింటే చాలు అభిమానులకు పూనకాలు రావడం గ్యారంటీ. ఆయన స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడు పదుల వయసొచ్చినా రజనీకాంత్ స్టైల్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని ఆయన లేటెస్ట్ సినిమాలు చూస్తే తెలుస్తోంది. అయితే ఈ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కయ్యానికి కాలు దువ్వడానికి రెడీ అయింది. కానీ నిజంగా కాదండోయ్.. కేవలం సినిమాలో మాత్రమే. రమ్యకృష్ణ, రజనీకాంత్ పేర్లు చెప్పగానే నరసింహ సినిమా వెంటనే గుర్తుకు వస్తుంది. ఇప్పటికీ ఆ సినిమాలో రజనీకాంత్, రమ్యకృష్ణ మధ్య సీన్స్ చూస్తే రోమాలు నిక్కబోడుచుకుంటాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే మళ్ళీ ఇన్నాళ్లకు వీరి కాంబో రిపీట్ కానుంది. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ తో ఒక సినిమా తీయబోతున్నారు.సన్ పిక్చర్స్ వారు నిర్మించబోతున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. `తలైవర్ 169` అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. ఇకపోతే ఈ చిత్రంలో రజనీకాంత్ కు జోడీగా ఎవరు నటిస్తారనే విషయంలో ఐశ్వర్యారాయ్ పేరు జోరుగా వినిపిస్తుంది.
కాగా ఈ సినిమా గురించి మరొక రూమర్ కూడా బాగా వినిపిస్తుంది. ఈ మూవీలో రజనీకాంత్ ముందు నిలిచి ఆయనను ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా మేకర్స్ రమ్యకృష్ణను కలిసి సినిమాలో ఆమె పాత్రను తెలియచేశారట. సినిమాలో తన పాత్ర నచ్చడంతో రమ్య కృష్ణ వెంటనే ఓకే చెప్పిందని వినికిడి. అయితే ఈ సినిమాలో రజనీ కాంత్,రమ్యకృష్ణల మధ్య సన్నివేశాలు వేరే లెవెల్లో ఉంటాయని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే రమ్య కృష్ణ నిజంగానే ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాలిసి ఉంది.వీరి ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావడం ఆనందంగా ఉందని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.