Samantha: The Family man2: ఫ్యామిలీ మేన్-2.. సమంత మాయ చేస్తుంది కానీ తప్పు చేస్తుందా?

controversy around samantha the family man2
Share

Samantha: The Family man2: సమంత Samantha: The Family man2 నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 తీవ్ర వివాదాస్పదమవుతోంది. జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను రద్దు చేయాలంటూ ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ అంశంలో ఈలం తమిళులను కించపరిచారనే వివాదానికి తోడు ఇందులో సమంత నటించడం మరో వివాదానికి తెర తీస్తోంది. తమిళ సంస్కృతి, సంప్రదాయాలు తెలిసి ఓ తమిళ నటి.. తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా ఎలా నటిస్తుందనేది ప్రభుత్వ వాదన. ఈ వెబ్ సిరీస్ విడుదలైతే తమిళనాడులో ఏకంగా తమిళుల మధ్య సామరస్యత దెబ్బతింటుందని సాక్షాత్తూ ఐటీ మంత్రి మనో తంగరాజ్ లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది.

controversy around samantha the family man2
controversy around samantha the family man2

సమంత తండ్రి తెలుగు, తల్లి మళయాళీ. ఆమె పుట్టింది కేరళలోనే అయినా.. చిన్ననాటి నుంచి పెరిగింది.. విద్యాభ్యాసం మొత్తం పూర్తైంది చెన్నైలోనే. దీంతో తాను తమిళియన్ గతంలోనే చెప్పుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు తిరుగులేని క్రేజ్ ఉంది. దీంతో ఈ పాత్రకు సమంతను తీసుకున్నారు దర్శకులు రాజ్ అండ్ డీకే. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ లో ఉగ్రవాదిగా ఆమె కనిపించిన తీరు ఆమె పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్టే ఉంది. అదే ఇప్పుడు ఆమె చుట్టూ వివాదంగా మారుతోంది. అయితే.. తమిళ ప్రజలే ఓ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే వదిలిపెట్టరు.. మరిప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి ఆమె పాత్రపై రచ్చ చేస్తోంది.

Read More: The Family Man 2: ఫ్యామిలీ మేన్-2 స్ట్రీమింగ్ రద్దు చేయండి..! తమిళ ప్రభుత్వం డిమాండ్..

తమిళనాడు ప్రభుత్వం కు కథ తెలుసా?.. కేవలం ట్రైలర్ చూసే ఆమె పాత్రను డిఫైన్ చేస్తుందా అనేది ఓ వాదన. సినిమా విడుదలయ్యాక అభ్యంతరకర సన్నివేశాలుంటే కత్తెర వేయాలనే డిమాండ్లు సహజమైనవి. కానీ.. తమిళ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వెళ్తోంది. నటీనటులు పాత్రల్లో నటిస్తారు కానీ.. పాత్రను బట్టి ఆయా ప్రాంతాలను, వ్యక్తులను కించపరిచే అవకాశం ఉండదు. తమిళియన్ గా, ప్రతిభ గల నటిగా సమంత ఇంత జాగ్రత్తలు తీసుకోకుండా, పాత్ర స్వభావం తెలీకుండా నటిస్తుందని చెప్పలేం. ఇంత వివాదాస్పదం అయిన తన పాత్రపై అయినా సమంత స్పందిస్తుందా.. తమిళులకు సమాధానం ఇస్తుందా.. ప్రజల ఆవేశం తగ్గుతుందా.. ప్రభుత్వం అర్ధం చేసుకుని సినిమా విడుదలకు సహకరిస్తుందా? అనేది చూడాల్సి ఉంది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ గుట్టు ఒక్కొక్కటిగా బయటపెడుతున్న సుజాత..! వాళ్ళే నాకలా చేయమని చెప్పారు

Teja

పెళ్లి బట్టల్లో రష్మిక .. ఇంత బాగుంది ఏంటి గురూ !

GRK

మ‌రో నిజ ప్రేమ ఘ‌ట‌నా చిత్రం

Siva Prasad