కార్తీకి కాపీ తలనొప్పి

Share

రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న మూవీ దేవ్.. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చిత్రటీమ్. యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఈ టీజర్ చూస్తుంటే కార్తికి బైక్‌ రేసింగ్‌ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అని తెలుస్తోంది. ఈ టీజర్‌ ద్వారా తెలుస్తోంది. ఇందులో కార్తీ చెప్పే డైలాగ్స్ , స్టైలిష్‌ లుక్, యాక్షన్‌ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. లవ్ ..రొమాన్స్ ..యాక్షన్ .. ఛేజింగ్ సీన్స్ చూస్తుంటే ఈ మూవీ పక్క హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతుంది. ఇందులో కార్తి సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా నుంచి అనంగే సాంగ్ రిలీజ్ అయ్యింది. మంచి రెస్పాన్స్ రాబడుతున్న ఈ సాంగ్ కి ఇప్పుడు కాపీ విమర్శలు వస్తున్నాయి. హరీష్ జై రాజ్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని, పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ హిట్ సాంగ్స్ లో ఒకటైన బిల్లీ జీన్ పాటలోని ట్యూన్ ని అసలు మార్చకుండా అలానే కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో మ్యూజిక్ డైరెక్టర్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.

మాములుగా అయితే ఒక హిట్ సాంగ్ నుంచి జస్ట్ ట్యూన్ మాత్రమే తీసుకుంటారు కానీ ఇలా మొత్తం సాంగ్ నే కాపీ కొడితే ఎలా అని కొందరు, హరీష్ జై రాజ్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాపీ కొట్టడం ఏంటని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలే హిట్ కోసం వెయిట్ చేస్తున్న కార్తీకి ఈ కాపీ విమర్శలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేలా ఉన్నాయి.


Share

Related posts

ఎఫ్ 3 లో ఆ ఫేడవుట్ హీరో అంటే కష్టమే ..?

GRK

Bigg boss Telugu : బీబీఉత్సవం షోలో హరితేజ శ్రీమంతం? అన్నీ టీఆర్పీ ట్రిక్సేనా?

Varun G

రాజ‌కీయ సేవ‌లో బోయ‌పాటి

Siva Prasad

Leave a Comment