Pawan Kalyan : ఓపక్క వకీల్ సాబ్ మ్యానియా.. మరోపక్క కరోనా..! ఏంటో పరిస్థితి..!?

corona virus second wave tensions to vakeel saab
Share

Pawan Kalyan : పవన్ కల్యాణ్ Pawan Kalyan ఖుషీ తర్వాత పదేళ్లు హిట్ లేకపోయినా తగ్గని క్రేజ్, అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా.. మొదటి రోజు వసూళ్లలో తిరుగులేని రికార్డ్, వరుస ఫ్లాపుల్లో ఉన్నా తగ్గని బిజినెస్.. ఇవే గుర్తొస్తాయి. ఇంత క్రేజ్ సాధించిన పవన్ కల్యాణ్.. ఏ హీరో చేయలేని సాహసం చేసారు. మూడేళ్లు సినిమాలు చేయలేదు. క్రేజ్ గురించి పట్టించుకోలేదు. రాజకీయాల్లో తలమునకలయ్యారు. మూడేళ్లకు ‘వకీల్ సాబ్’ సినిమాతో వస్తున్నారు. అతి భారీ క్రేజ్ నెలకొన్న ఈ సినిమా గురించి మెగా అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అయితే.. ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కాస్తంత ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

corona virus second wave tensions to vakeel saab Pawan Kalyan
corona virus second wave tensions to vakeel saab Pawan Kalyan

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ గణనీయంగా పెరుగుతున్న కొత్త కేసులు కలవర పెడుతున్నాయి. రెండు వారాల ముందు వరకూ రోజుకు 100లోపే కేసులు నమోదైతే.. ఇప్పుడు రోజుకు దాదాపు 1500 కేసులు నమోదవుతున్నాయి. ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారా? అనే టాలీవుడ్ పెద్దల భయాలను పోగొడుతూ గడచిన మూడు నెలల్లో.. నెలకో సినిమా చొప్పున భరీ హిట్లు సాధించాయి. ఎప్పిటిలా సినిమాను ఆదరించారు ప్రేక్షకులు. ఈ సంతోషంలో ఉన్న పరిశ్రమకు ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ భయం కలిగిస్తోంది. గతేడాది కరోనా పరిస్థితుల తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా వకీల్ సాబ్. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న సినిమాకు బుకింగ్స్ ప్రారంభమై తొలిరోజు దాదాపుగా పూర్తైపోయాయి. ట్రైలర్ రీలీజ్ కే ధియేటర్లకు పోటెత్తిపోయారు పవన్ అభిమానులు. పవన్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ కు తిరుగుండదు. టాక్ తో సంబంధం లేకుండా పవన్ సినిమా చూసే వారూ ఉన్నారు. అయితే..

ప్రస్తుతం కరోనా సెకండ్ తీవ్ర కలకలం రేపుతోంది. బయటకు వెళ్లాలంటేనే భయం కలిగిస్తున్న పరిస్థితులు. అవసరమైతే కానీ.. బయటకు రావొద్దని, మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు ప్రచారాలతో, జాగ్రత్తలతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యోం ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలతో కలిసి సినిమాకు ఏమేరకు వస్తారనేదే కాస్త ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతానికి ధియేటర్లకు జనం వస్తున్నారు. కానీ.. రోజురోజుకీ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఓపక్క భయాందోళనలు ఉంటూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారో.. వకీల్ సాబ్ పై కరోనా ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సిందే..!


Share

Related posts

బ్రేకింగ్ : బంగారు వ్యాపారిపై చెన్నైలో ఐటీ కేసు…! ఏపీలో సంచలనం..!

Srinivas Manem

అంబానీతో లింకు..! చంద్రబాబు సంపాదన వందల కోట్లలోనే..?

Srinivas Manem

వర్మ లాయర్ వీకా ? మర్డర్ సినిమా విషయం లో డిప్రెషన్ లో రామూ ?

GRK