కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ తరహాలో సినిమాలు చేసి విజయాలు అందుకోవడంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు అని అందరికీ తెలుసు. ఇప్పటివరకూ చేసిన సినిమా ఏది ఫ్లాప్ అవకపోవడం తో పాటు అన్ని బ్లాక్ బస్టర్ విజయాలు కావడంతో…. డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” అనే సినిమా చేసి అదిరిపోయే విజయాన్ని అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకోవడం తెలిసిందే. అంతకుముందు పటాస్, F1 సినిమాలను చేసి విజయాలను అందుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల నటసింహం బాలయ్య బాబుకి అరగంటలో స్క్రిప్ట్ చెప్పి అనిల్ రావిపూడి ఓకే చేయించుకున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల లో టాక్ నడుస్తుంది.
కమర్షియల్ నేపథ్యంలో మాస్ తరహా లో బాలయ్య బాబుకి అనిల్ రావిపూడి స్క్రిప్ట్ చెప్పారట. లైన్ నచ్చడంతో పాటు గతంలో సూపర్ డూపర్ హిట్ ట్రాక్ అనిల్ రావిపూడి కి ఉండటంతో…. దాదాపు నటసింహం బాలయ్య బాబు తో సినిమాని అనిల్ ఓకే చేయించుకున్నట్లు టాక్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినబడుతోంది. ముఖ్యంగా అరగంట అంటే అరగంటలోనే బాలయ్య బాబుని సినిమాకి అనిల్ ఓకే చేయించటం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు సినిమా స్టోరీ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.