ఓ నటిని మలయాళ నటుడు దిలీప్ లైంగిక వేధింపులకు గురి చేశాడనే దానిపై కోర్టులో కేసు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి దిలీప్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విషయంలో అదనపు స్పెషల్ కోర్టు దిలీప్‌కు షాకిచ్చింది. అతను వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ట్రయల్ కోర్టు నిర్ణయంతో దిలీప్ హైకోర్టుకు వెళ్లే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తుంది. 2017లో దిలీప్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు పెద్ద దుమారాన్నే రేపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన దిలీప్ కేసును తారుమారు చేస్తున్నాడని ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో బాధితురాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. లైంగిక వేధింపులకు సంబంధిచిన వీడియోను నిందితుడుకి కానీ, అతని స్నేహితులకు కానీ ఇవ్వకూడదని బాధితురాలు కోరింది. కోర్టుతో పాటు కేరళ ప్రభుత్వం కూడా ఆమెకు సానుకూలంగా స్పందించారు.
previous post
next post
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!