25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

SSMB 28: మహేష్ త్రివిక్రమ్ సినిమాలో విలన్ పాత్రకి సంబంధించి క్రేజీ న్యూస్..!!

Share

SSMB 28: దాదాపు 11 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలలో మహేష్ రెండు విధాలుగా కనిపించడం జరిగింది. దీంతో వస్తున్న ఈ మూడో సినిమాలో మహేష్ బాబుని త్రివిక్రమ్ ఏవిధంగా చూపిస్తాడు అన్నది అభిమానులు ఉత్కంఠ పరితంగా ఎదురుచూస్తున్నారు. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే ఈ సినిమాకి సంబంధించి విలన్ పాత్రలో సీనియర్ హీరో జగపతిబాబుని ఓకే చేసినట్లు సరికొత్త వార్త వస్తుంది.

Crazy news regarding Mahesh Trivikram's villain role in the movie

ఇటీవల చాలా సినిమాలలో జగపతిబాబు విలన్ పాత్రలో కనిపించడం జరిగింది. నాన్నకు ప్రేమతో, మహర్షి, అరవింద సమేత వీర రాఘవ, లెజెండ్ వంటి సినిమాలలో భయంకరమైన విలనిజంతో ఆడియన్స్ నీ మెప్పించారు. వీటిలో అరవింద సమేత వీర రాఘవ గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చింది. దీంతో ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సినిమా కోసం జగపతిబాబుని త్రివిక్రమ్ ఓకే చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో మహేష్ కి జోడిగా మరో హీరోయిన్ పాత్రలో శ్రీ లీల నటిస్తోంది.

Crazy news regarding Mahesh Trivikram's villain role in the movie

పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వాస్తవానికి షూటింగ్ స్టార్ట్ చేసిన సమయంలో ఏప్రిల్ 28న రిలీజ్ చేయాలని భావించారు. అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయగా అక్టోబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే మహేష్ తల్లి ఇందిరా, తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణాలతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే కాలేజీ గాయం కావడంతో షూటింగ్ ఆలస్యమైంది. కానీ ఇటీవల సంక్రాంతి పండుగ తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు నెలలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Share

Related posts

బ్రేకింగ్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు.. భారతీయ చలన చిత్ర చరిత్రలో తొలిసారి..

Vihari

Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ సగం సినిమా షూటింగ్ అక్కడే..?

Teja

కోన వెంకట్ “క‌ర‌ణం మల్లేశ్వరి” గా తాప్సీ ..!

GRK