తెలుగు సినీ పరిశ్రమలో మూడు దశాబ్దాలుగా కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అయిపోయారు బ్రహ్మానందం. ఒకదశలో బ్రహ్మానందం లేకపోతే సినిమా లేదు. తన బిజీ షెడ్యూల్స్ తో టాప్ హీరోలను కూడా వెయిట్ చేయించిన క్రేజ్ ఆయనది. కేవలం ఆయన కోసమే స్పెషల్ ట్రాక్స్ రాసేవారంటే బ్రహ్మీ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయనపై ఇండస్ట్రీలో ఓ గాసిప్ రన్ అవుతోంది. ఇకపై ఆయన సినిమాలు కాకుండా టీవీ కార్యక్రమాల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన చర్చలు కూడా ఓ టీవీ చానెల్ తో జరిగాయని అంటున్నారు. అయితే.. బ్రహ్మానందం చేయబోయేది టీవీ సీరియల్ లో పాత్రలా.. లేక ప్రత్యేక కార్యక్రమమా అనేది తెలియాల్సి ఉంది. ఆయన మార్క్ ని టీవీల్లో చూపించే విధంగా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ వార్తలపై ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. బ్రహ్మానందం కానీ.. ఏ చానెల్ కానీ దీనిపై అఫీషియల్ న్యూస్ ఇవ్వలేదు. మరి ఈ వార్తలపై నిజమెంతుందో బ్రహ్మానందం కానీ చానెల్ వారు కానీ చెప్పాల్సిందే.
దాదాపు మూడున్నర దశాబ్దాలుగా బ్రహ్మానందం నుంచి ఎన్నో అద్భుతమైన కామెడీ పాత్రలు వచ్చాయి. అయితే బ్రహ్మీ ఒక అక్షయపాత్ర. ఆయన్నుంచి ఎన్ని హావభావాలతో కామెడీ వచ్చినా ఇంకా కొత్తగా ఇవ్వగలరు. వయసు ప్రభావం.. హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. సినిమాలను కూడా తగ్గించుకున్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో ఓ పాత్ర చేశారు. రీసెంట్ గా అల.. వైకుంఠపురములో ‘రాములో.. రాములా’ పాటలో మెరిశారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!