Categories: సినిమా

Mahesh-Trivikram: మ‌హేశ్‌-త్రివిక్ర‌మ్ మూవీపై క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో అభిమానులు!

Share

Mahesh-Trivikram: సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఇటీవ‌లె `స‌ర్కారు వారి పాట‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించింది. మే 12న విడుద‌లైన ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా స‌గానికి పైగా టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది.

ఇదిలా ఉంటే.. `స‌ర్కారు వారి పాట‌` అనంత‌రం మ‌హేశ్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి సినిమాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న హ్యాట్రిక్ చిత్ర‌మిది. ఇందులో మ‌హేశ్ బాబుకు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.

`ఎస్ఎమ్‌బీ 28` అనే వర్కింగ్ టైటిల్‌తో ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. త‌ర్వ‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ను సైతం షురూ చేయ‌బోతున్నారు. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. మ‌హేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ మే 31న పుట్టినరోజు జ‌రుపుకోబోతున్నారు.

అయితే ఆ రోజున `ఎస్ఎమ్‌బీ 28` సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట‌. దీనిపై మేక‌ర్స్ మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌బోతున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. మ‌హేశ్ అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

3 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

12 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago