Subscribe for notification
Categories: సినిమా

NTR 31: `ఎన్టీఆర్ 31`లో తార‌క్ రోల్‌పై క్రేజీ అప్డేట్.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పూన‌కాలే

Share

NTR 31: `ఆర్ఆర్ఆర్‌`తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించారు. ఇది పూర్తైన వెంట‌నే `కేజీఎఫ్‌`తో నేష‌న‌ల్ వైడ్‌గా పాపుల‌ర్ అయిన డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఓ మూవీని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

`ఎన్టీఆర్ 31` వ‌ర్కింగ్ టైటిల్‌తో వ‌చ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యాన‌ర్ల‌పై హై బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇందులో ఎన్టీఆర్ మున్నెప్పుడూ క‌నిపించ‌నంత ఊర మాస్ లుక్‌లో ద‌ర్శ‌న‌మివ్వబోతున్నారు.

అలాగే ఈ చిత్రానికి `అసురుడు` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉందంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలోని తార‌క్ రోల్‌పై ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఇందులో తార‌క్ కాస్త నెగ‌టివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో కనిపించ‌బోతున్నార‌ట‌.

కేజీఎఫ్ లో ఎలా అయితే య‌శ్ ను నెగిటివ్ షేడ్స్ లో చూపించాడో.. అలాగే `ఎన్టీఆర్31` లో తార‌క్‌ను ప్ర‌శాంత్ నీల్ కాస్త నెగ‌టివ్‌గా చూపించబోతున్నాడ‌ట‌. అందుకే ఆయ‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్లు `అసురుడు` అనే టైటిల్ ఖ‌రారు చేయాల‌ని చూస్తున్న‌ట్లు తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మ‌రి ఇదే నిజ‌మైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయ‌మ‌ని అంటున్నారు.


Share
kavya N

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

2 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

3 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

4 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

5 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

6 hours ago