NewsOrbit
సినిమా

Daggubati Family: రానా తమ్ముడి కోసం క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సిద్ధం..!?

Daggubati Family: Crazy music combo again
Advertisements
Share

Daggubati Family: తెలుగు సినీ సంగీత లోకంలో కొన్ని జంటలు కలకాలం గుర్తుంటాయి.. ఆ డైరెక్టర్ కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ జత కలిస్తే ఆ సినిమా మ్యూజికల్ గా హిట్టే.., ఆ పాటలు చారిత్రకామే అనే ముద్ర పడిపోతుంది.. “వంశీ – ఇళయరాజా”.., “కె రాఘవేంద్రరావు – కీరవాణి”., “ఎస్ ఎస్ రాజమౌళి – ఎం ఎం కీరవాణీ” .., “సుకుమార్ – దేవీ శ్రీ ప్రసాద్”.. “గుణ శేఖర్ – మణిశర్మ”.. “శంకర్ – రెహ్మాన్”.., ఈ సంగీత దర్శకులు అందరూ ఆయా దర్శకులకు ఆస్థాన విద్వాంసులుగా ఉండిపోయారు. బయట కూడా చేస్తూనే.. వారి కాంబో వస్తే హిట్ పక్కాగా అనేంతగా నాటుకుపోయారు. ఈ కోవలోకే మరో జంట కూడా వస్తుంది. “తేజ – ఆర్ఫీ పట్నాయక్”..! జయం, చిత్రం, నువ్వు నేను, అవునన్నా – కాదన్నా.. వంటి అనేక సినిమాలకు ఆర్ఫీ ప్రాణం పోశారు. తర్వాత వరుస ఫ్లాపులతో తేజ ఫామ్ కోల్పోయారు. ఆర్ఫీ కూడా దూరమయ్యారు. దాదాపు దశాబ్దం తర్వాత తేజ మళ్ళీ “నేనే రాజు నేనే మంత్రి”తో హిట్ కొట్టారు. దాంతో ఇండస్ట్రీ ఆయనను చూడడం మొదలు పెట్టింది. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.

Advertisements
Daggubati Family: Crazy music combo again
Daggubati Family Crazy music combo again

Daggubati Family: రానా తమ్ముడి సినిమాకు వీళ్లిద్దరితో..!

దగ్గుబాటి రానా తమ్ముడు, సురేష్ బాబు చిన్న కొడుకు అభిరాం హీరోగా 1 . 1 అనే సినిమా రూపొందుతుంది. తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఆర్ఫీ పట్నాయక్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే చర్చలు ముగిసాయి, అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని ఫిలిం నగర్ టాక్ వస్తోంది. ఇదే నిజమైతే దాదాపు పాదిహేనేళ్ళ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ వస్తున్నట్టు. చివరిగా 2005 లో ఉదయ్ కిరణ్ – సదా జంటగా నటించిన “ఔనన్నా కాదన్నా” చిత్రానికి తేజ – ఆర్ఫీ పట్నాయక్ కాంబినేషన్ కలిసి పని చేసింది..!

Advertisements

Share
Advertisements

Related posts

షూటింగ్‌లోనే ఆ స్టార్ హీరోయిన్‌ని నోటికొచ్చినట్టు తిట్టిన హీరో..!

Ram

Kajol Devgan New HD Stills

Gallery Desk

Srikanth addala : నారప్ప శ్రీకాంత్ అడ్డాలకి సక్సెస్ ఇవ్వనట్టేనా..?

GRK