త్వరలో దగ్గుబాటి ఇంట్లో పెళ్లిబాజా మోగబోతోంది. దగ్గుబాటి ఇంట్లో పెళ్లి అనగానే రానాది అనుకోకండి, విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రితది. గత కొన్ని రోజులుగా ఆశ్రిత పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో ఆశ్రిత పెళ్లి జరగనుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. అయితే పెళ్లి కొడుకు ఎవరూ అనే విషయంలో అధికారిక ప్రకటన లేకపోవడంతో ఎవరికి తోచింది వాళ్లు రాసుకుంటున్నారు.
ఆశ్రితని పెళ్లాడే వ్యక్తి గురించి వివరాలు తెలియకపోయినా కూడా పెళ్లి మాత్రం రానున్న రెండు నెలల్లో ఉంటుందని తెలుస్తుంది. ఇదే నిజం ఐతే చాలా రోజుల తరువాత వెంకీ ఫ్యామిలీలో జరగబోయే శుభకార్యం ఇదే. ఇక దగ్గుబాటి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రానా పెళ్లి వార్త కూడా ఇదే ఏడాది బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మన భళ్లాలదేవుడిని పెళ్లాడబోయే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.