F3 Movie: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన `ఎఫ్ 2` చిత్రం 2019లో విడుదలై ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా `ఎఫ్ 3` రాబోతోంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించగా.. వారి సరసన తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా చేశారు.
అలాగే సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సమ్మర్ సోగ్గాళ్ళు సందడి షురూ చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇందులో భాగంగానే తాజాగా `ఎఫ్ 3` ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 9న ఈ సినిమా ట్రైలర్‌ను వదలబోతున్నారు. ఈ మేరకు మేకర్స్ ఓ వీడియో రూపంలో అధికారికంగా అనౌన్స్ చేశారు. దీంతో అటు వెంకీ ఫ్యాన్స్, ఇటు వరుణ్ ఫ్యాన్స్ ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
కాగా, డబ్బు నేపథ్యంలో ఎఫ్ 3 చిత్రాన్ని తెరకెక్కించారు. డబ్బు, దాని వల్ల వచ్చే సమస్యల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. ఇందులో రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేశ్ నటిస్తే.. నత్తితో ఇబ్బంది పడే వ్యక్తిగా వరుణ్ అలరించబోతున్నాడు. అలాగే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.