F3: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి పూర్తిగా హైదరాబాద్ నగరంలో వివిధ కార్యక్రమాలు జరుగుతూ. ఇక తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాదులోని అన్నీ జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పెద్దగా సినిమా రంగానికి సంబంధించి ఎటువంటి వేడుకలు చెప్పుకోడానికి ఏమి జరగటం లేదు. అయితే ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో.. చాలా వరకు షూటింగ్ లు మరియు వేడుకలు ఏపీలో జరుగుతూ వస్తున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎక్కువగా తూర్పు గోదావరి ప్రాంతం మారేడుమిల్లి అడవులలో అదేవిధంగా విశాఖపట్టణం పరిసర ప్రాంతాలలో ఈ మధ్య భారీగా షూటింగు జరుపుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక సినిమా వేడుకలకు వచ్చేసరికి విశాఖపట్టణం, కర్నూల్, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతున్నాయి. మొన్ననే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట విజయోత్సవ వేడుక కర్నూల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత అఖండ సిల్వర్ జూబ్లీ వేడుక కూడా జరిగింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు రీసెంట్ గా గత వారం విడుదలైన “F3” సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండటంతో రేపు జూన్ 4వ తారీఖు విశాఖ పట్టణంలో విజయోత్సవ సభ నిర్వహించడానికి “F3” మూవీ మేకర్స్ రెడీ అయ్యారు. విశాఖ ఆర్కే బీచ్ ఒడ్డున ఈ వేడుక జరగనుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు ఇద్దరు హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్ లు అందరూ..ఈ సక్సెస్ మీట్ కి రాబోతున్నారు..అని సమాచారం. కాగా ఈ వేడుకలకు సంబంధించి మరికొద్ది గంటల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.