టెలివిజన్ లో “RRR” రిలీజ్ డేట్ డీటెయిల్స్..!!

Share

ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” భారీ విజయం సాధించడం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ టైం రామ్ చరణ్.. తారక్ కలిసినటించడంతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టార్ ప్రాజెక్టుగా పేరు సంపాదించి మంచి క్రేజీ దక్కించుకుని కళ్ళు చెదిరే విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా కొన్ని వందల కోట్లు ఈ సినిమా సాధించడం సంచలనం రేపింది.

ముఖ్యంగా “బాహుబలి 2” వంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “RRR” రావటంతో ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవ్వకముందే మంచి క్రేజ్ దక్కించుకుని.. అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ఇక నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన తర్వాత హాలీవుడ్ దర్శకులు ఇంకా చాలామంది టెక్నీషియన్ లు “RRR” సినిమా యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కొన్ని దేశాలలో అయితే ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకమైన ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది.

ఇక చరణ్ నటన చూసి హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు జేమ్స్ బాండ్ సినిమాలకు పనికొచ్చే కంటెంట్ ఉందని తెలిపారు. నెట్ ఫ్లిక్స్ లో “RRR” అనేక రికార్డులు క్రియేట్ చేసింది. కొన్ని నెలలు పాటు టాప్ పొజిషన్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆగస్టు 14వ తారీకు “స్టార్ మా” ఛానల్ లో ప్రసారం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. ప్రీమియర్ టైం తెలియజేయలేదు. ఇక హిందీలో జీ సినిమాలో అదే తారీకు సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేస్తున్నట్లు ప్రకటన చేయడం జరిగింది. మరి టెలివిజన్ రంగంలో “RRR” టిఆర్పి రేటింగ్ విషయంలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

58 mins ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

2 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

3 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

4 hours ago