సినిమా

Deepika Padukone: ఓ ఫ్రెంచ్ బ్రాండుకి బ్రాండ్ అంబాసిడర్ గా దీపికా పదుకొనే!

Share

Deepika Padukone: దీపికా పదుకొణే.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. ఓం శాంతి ఓం సినిమాతో బి టౌన్లో అడుగు పెట్టిన దీపిక, వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. 2007లో బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్, దీపిక జంటగా నటించిన ఈ సినిమా బాక్షాఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్లను సొంతం చేసుకుంది. నటిగా ఆమెకి అది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో పరిణితి చెందిన వ్యక్తిలా నటించింది. దాంతో వరుస అవకాశాలు దీపికను అక్కడ సూపర్ స్టార్ ని చేశాయి. అవును.. ఇపుడు అక్కడ చెప్పుకోదగ్గ నటీమణులలో దీపిక ముందు వరుసలో ఉంటుంది.

పాన్ ఇండియా స్టార్?

అంతేకాకుండా ఈ క్రమంలో బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లింది. ‘రిటర్న్స్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్’ అనే హాలీవుడ్ సినిమాతో అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది. దాని తరువాత అక్కడ అవకాశాలు ఇంకా వచ్చినా, భారతీయ నటిగా ఇండియాలో ఉండటానికి దీపిక ఇష్టపడింది. ఆ తరువాత రణవీర్ సింగ్ తో ప్రేమాయణం, పెళ్లి జరిగాయి. దీపికా పదుకొణేకి పాన్ ఇండియా స్థాయిలో వున్న క్రేజ్ గురించి మాట్లాడుకోవలసిన పని లేదు. ఇప్పుడా క్రేజ్ తోనే మరో ప్రఖ్యాత బ్రాండ్ కి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశం పొందింది.

లూయిస్ విట్టన్ తో నా అనుబంధం రెండవసారి!

ప్రముఖ ప్రెంచ్ లగ్జరీ ప్యాషన్ బ్రాండ్ అయినటువంటి ‘లూయిస్ విట్టన్’కు తాజాగా దీపిక బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని దీపిక ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రెంచ్ బ్రాండ్ తో తన అగ్రిమెంట్ విషయాన్ని దీపిక వోగ్ మ్యాగజైన్ తో తాజాగా పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లూయిస్ విట్టన్ తో నా అనుబంధం ఇది రెండవసారి. ఇది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను.. ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను… అని తెలిపింది. ఇకపోతే ప్రఖ్యాత లూయిస్ విట్టన్ లెదర్ బ్రాండ్లకి అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న మొట్ట మొదటి భారతీయు నటి దీపిక పదుకొణే కావడం విశేషం.


Share

Related posts

బాలీవుడ్ రీమేక్‌ని చేయ‌బోయే దెవ‌రో?

Siva Prasad

Prabhas: నాగ్ అశ్విన్ కొత్త కామెంట్స్ తో ప్రభాస్ ఫాన్స్ లో ఫుల్ జోష్!!

Naina

అనిల్ రావిపుడి కి పరమ బ్యాడ్ టైం అంటే ఇదేనేమో ..?  

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar