25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Deepika Padukone: ఆస్కార్ వేదికపై అరుదైన గౌరవం దక్కించుకున్న దీపికా పదుకొనే..!!

Share

Deepika Padukone: ఈ నెలలోనే ఆస్కార్ ప్రధానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఇండియా నుండి ఆస్కార్ రేసులో “RRR” ఉంది. ఒరిజినల్ క్యాటగిరి సాంగ్ కింద “నాటు నాటు” సాంగ్ బరిలో ఉంది. ఈ పాటకి గోల్డెన్ గ్లోబ్ అంతర్జాతీయ అవార్డు రావడం తెలిసిందే. దీంతో కచ్చితంగా “RRR” ఆస్కార్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఆస్కార్ ప్రధాన ఉత్సవం కార్యక్రమంలో అరుదైన గౌరవం సంపాదించుకుంది. విషయంలోకి వెళ్తే ఆస్కార్ వేడుకలు అవార్డు ప్రధానం చేసే వ్యక్తుల జాబితాలో దీపిక చోటు సంపాదించుకుంది.

Deepika Padukone got a rare honor on the stage of Oscar

ఇందుకు సంబంధించి ఆస్కార్ లిస్ట్ ను నిర్వాహకులు రిలీజ్ చేశారు. దీపికా పదుకొనేతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ డ్వైన్ జాన్సన్ (రాక్), జోయ్ సాల్డానా సహా మరో పదహారు మంది ప్రముఖులను నిర్వాహకులు ఎంపిక చేయడం జరిగింది. భారత కాలమున ప్రకారం ఈ నెల 13వ తారీకు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచంలో నలుమూలల నుండి చాలామంది సెలబ్రిటీలు రానున్నారు. “RRR” ఆస్కార్ గెలిస్తే ఒక చరిత్ర అవుతుంది. తెలుగు చలనచిత్ర రంగంలో రాజమౌళి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసినట్లు అవుతుంది. ఈ సినిమాతో తెలుగు చలనచిత్ర రంగం యొక్క స్థాయి ప్రపంచ సినిమా రంగంలో ఓ రేంజ్ లో పెరిగింది.

Deepika Padukone got a rare honor on the stage of Oscar

దీంతో చాలామంది భారతీయ సినీ ప్రేమికులు “RRR”… ఆస్కార్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇటీవల హీరోయిన్ దీపికా పదుకొనే కత్తర్ వరల్డ్ కప్ టోర్నీలో కూడా పాల్గొనడం జరిగింది. ఖత్తర్ లో జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ టోర్నీలో… దీపికా పదుకొనే ఫైనల్ మ్యాచ్ లో… వరల్డ్ కప్ ట్రోఫీని స్టేడియం లోకి తీసుకొచ్చి.. అరుదైన గౌరవం సొంతం చేసుకుని… ఫైనల్ మ్యాచ్ లో అందరి చూపును ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దీపికా పదుకొనే.. ప్రత్యేకమైన క్రేజ్ తో ఉన్నతమైన స్థానాలను అధిరోహిస్తూ ఉంది.


Share

Related posts

Singer Sunitha: కొడుకుని రంగంలోకి దించుతున్న సింగర్ సునీత.. మాస్టర్ ప్లాన్ ఇదే.!

Ram

అప్‌డేట్ ప్లీజ్ అంటున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌

Siva Prasad

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇదిగో….?

arun kanna