Deepika -Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న దీపికా పదుకునే కీలకమైన పదవికి రాజీనామా చేశారు. ఒకవైపు హీరోయిన్ గా సినిమాలలో నటిస్తూ, మరోవైపు “మామి” (ముంబయి అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్)
చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం దీపికా మామి చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఓ పోస్టు పెట్టారు.

ప్రస్తుతం దీపిక వరుస సినిమాలతో పలు షూటింగ్ లలో ఎంతో బిజీగా ఉన్నారు. షూటింగ్ తో బిజీగా ఉన్న దీపికాకు ఇతర పనులపై దృష్టి సారించడానికి సమయం సరిపోకపోవడం వల్లే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ‘‘మామి’ బోర్డులో సభ్యురాలిగా ఉన్నందుకు, చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించినందుకు ఎంతో గర్విస్తున్నా.. వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉండడంతో “మామి”కి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నా, “మామి”తో ఉన్న అనుబంధం విడదీయరానిది, అంటూ దీపిక తెలియజేశారు.
మామి చైర్ పర్సన్ కిరణ్ రావు:
టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు “మామి” చైర్ పర్సన్ బాధ్యతలను నిర్వహించేది. అయితే ఆమె పదవీ కాలం పూర్తి అవగానే 2019లో ఆ బాధ్యతలను దీపిక చేపట్టారు. అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న దీపికాకు “మామి”బాధ్యతలు నిర్వర్తించడం కుదరకపోవడం వల్ల ఈ పదవికి రాజీనామా చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే దీపికా ప్రస్తుతం షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పఠాన్’ చిత్ర షూట్‌లో బిజీగా ఉన్నారు. అదేవిధంగా హృతిక్ సరసన” ఫైటర్” సినిమాలో కూడా నటించనున్నారు. ఇక పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో దీపికా హీరోయిన్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం.