Deepika Padukone: బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ దీపికా పదుకొనే. ఒక బాలీవుడ్ లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ పొడుగు కాళ్ల సుందరికి మంచి క్రేజ్ ఉంది. 2006వ సంవత్సరంలో కన్నడ ఇండస్ట్రీలో “ఐశ్వర్య” అనే సినిమాతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే సెకండ్ మూవీ షారుక్ ఖాన్ నటించిన “ఓం శాంతి ఓం”లో సూపర్ డూపర్ ఛాన్స్ కొట్టేసి తిరుగులేని క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా విజయంతో బాలీవుడ్ లో రెండో సినిమాకి స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అప్పటినుండి ఏకధాటిగా వరుస ఆఫర్లు అందుకుంటున్న దీపికాపదుకునే.. తాజాగా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కె” అనే టైటిల్ పేరిట తెరకెక్కుతున్న సినిమాలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ హైదరాబాదులో స్టార్ట్ కావడం జరిగింది. దీంతో నేడు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి దీపికా హైదరాబాద్ రావటం సంచలనంగా మారింది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నరు. నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి తన ఫస్ట్ షెడ్యూల్ లో దీపికా పదుకొనే కొన్ని కీలక సన్నివేశాలలో నటించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ప్రభాస్ కెరియర్ లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తున్నారు. టైం మిషన్ తరహాలో ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.