Deepti: కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో షన్ను – దీప్తిల బ్రేకప్ వ్యవహారం చక్కెర్లు కొడుతోంది. చాలా కాలంగా లవ్ ట్రాకును నడిపిన వీళ్లిద్దరూ పెళ్లి పీటలు ఎక్కుతారు అని అంతా అనుకున్నారు. ఇంతలో వారి మధ్యన ఏం జరిగిందో తెలియదు గాని సడెన్ గా దీప్తి షన్నుకి బ్రేకప్ చెప్పింది. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయ్యింది. బిగ్ బాస్ షన్ను కి చేసిన లాభం కంటే నష్టాన్నే మిగిల్చిందని చెప్పుకోవాలి.
Deepti: సిరిమీద వచ్చిన రూమర్స్ ఇవే..
అంతవరకూ బాగానే వుంది. వాళ్ళేదో నచ్చక విడిపోయారు. మధ్యలో సిరి ఏం చేసినదని! పాపం ఆమెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వర్గం వారు తెగ ట్రోల్ చేసారు. దీనికి యాంకర్ రవి స్పందించి సదరు గ్యాంగ్ ని వారించాడు. ఏదో గేమ్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ లో వారు క్లోజ్ గా ఉండొచ్చు. దానికి సిరిని టార్గెట్ చేయడం మంచిది కాదు కదా. ఇక తాజాగా సిరి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి శ్రీహాన్ సిరి పుట్టిన రోజుని ఎంత గ్రాండ్ గా చేసాడో తెలియంది కాదు. అనవసరంగా ఒకళ్ళ మీద రాళ్లు విసరకూడదు.
దీప్తి తాజాగా చేసిన పోస్టు ఇదే..
దీప్తి ప్రస్తుతం సోషల్ మీడియాలో గతంలో మాదిరిగా యాక్టివ్ గా కనిపించడం లేదు. అయితే తాజాగా ఇన్‌స్టాలో ఓ రీల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో తన తండ్రి కూడా ఉన్నారు. దీంతో ఇది వైరల్ అయిపోయింది. ఈ రీల్లో తండ్రితో కలిసి ఆమె క్యూట్‌గా ఆడుకుంటూ కనిపించింది. దీనికి ‘ఆమె ఒంటరిగా మిగిలిపోలేదు. ఆమెకు తండ్రి ప్రేమ అండగా నిలిచింది. కనిపించని నైతిక శక్తిగా మారిపోయింది’ అంటూ రాసుకొచ్చింది. దీంతో తనకు తండ్రితో పాటు కుటుంబం ఎంత ధైర్యాన్ని ఇచ్చింది అన్న విషయాన్ని దీప్తి సునైనా పరోక్షంగా వెల్లడించింది.