బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటేనే భారీ అంచనాలు ఉంటాయి, వాటిని అందుకోవడానికి సిద్దమై సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా ‘వినయ విధేయ రామ’. ఒక రెగ్యులర్ కమర్షియల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకొని మెగా ఫ్యామిలీతో పాటు సినీ అభిమానులని కూడా ఆశ్చర్యపరిచింది. ఆర్మీ కూడా ఆపలేని విలన్ ని ఒక మాములు కుర్రాడు ఆపడం, చంపడం ఒక్క బోయపాటి సినిమాల్లో మాత్రమే జరుగుతుందేమో. బహుశా చరణ్ నటించిన ఏ సినిమాకి కూడా ఇంత నెగటివ్ టాక్ వచ్చి ఉండదు. అంతలా నిరాశపరిచిన వినయ విధేయ రామ సినిమాలో కథకి, టైటిల్ కి, కథనంకి సంబంధమే లేదు.
యాంటీ గ్రావిటీ ఫైట్స్, భారీ డైలాగులు తప్ప ఏమి లేని సినిమాపై రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉండేవి, వాటికి కొంచెం పాజిటివ్ టాక్ తోడైనా కూడా వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేసున్నాయి కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొదటి షోకే నెగటివ్ టాక్ రావడం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలవ్వడంతో వినయ విధేయ రామ పరిస్థితి తలకిందులయ్యింది. భారీ అంచనాలతో, సంక్రాంతి పందెం కోడిగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ 65కోట్ల గ్రాస్ రాబట్టింది. నిజానికి ఇది ఎక్కువ అమౌంటే అయినా కూడా అనుకున్న దానితో పోలిస్తే చాలా తక్కువ, నిజానికి ఇది కూడా వచ్చింది అంటే కేవలం చరణ్ మ్యానియాతోనే, ఇప్పుడు ఈ మెగాపవర్ స్టార్ స్టామీనానే సినిమాని కూడా కాపాడాలి.
ఇప్పటికే నెగటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపొయింది కాబట్టి… సినిమా కలెక్షన్స్ మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే వినయ విధేయ రామ సినిమాకి భారీ నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి ఇప్పుడు వినిపిస్తున్న టాక్ లో చరణ్ చేసిన తప్పేమి లేదు, ఒక కథని నమ్మి హీరో చేయాల్సిందంతా చేశాడు, బాగా కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపైన కనిపిస్తుంది కూడా… సో ఎటు చూసిన వినయ విధేయ రామ సినిమాకి సోల్ రీజన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనునే అవుతాడు. మరి ఇప్పుడున్న టాక్ తో వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకూ నెట్టుకొస్తుందో చూడాలి.