NewsOrbit
Entertainment News సినిమా

Pushpa 2: “పుష్ప 2” తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయబోయే సినిమా డీటెయిల్స్..?

Share

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప మొదటి భాగం 2021 లో విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం బన్నీ తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా బన్నీకి క్రేజ్ డబల్ త్రిబుల్ అయింది. దీంతో ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ పై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. గత నెల అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడు ఏప్రిల్ ఏడవ తారీఖు “పుష్ప 2” ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ కావటం తెలిసిందే. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. బన్నీ లుక్ మరియు డైలాగులు చాలా హైలైట్ అయ్యాయి.

allu arjun and Details of icon star Allu Arjun's upcoming movie after Pushpa 2

అయితే ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో చేస్తారు అన్నది ఆసక్తికరంగా ఉన్న క్రమంలో తాజాగా ఇండస్ట్రీ నుండి అదృష్టం సమాచారం ప్రకారం త్రివిక్రమ్ తో చేయడానికి రెడీ అయినట్లు టాక్. నా పేరు సూర్య వంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత బన్నీ చాలాకాలం పాటు వెయిట్ చేసి త్రివిక్రమ్ దర్శకత్వంలో “అలా వైకుంటపురంలో” తో సూపర్ డూపర్ హిట్ అందుకోవడం జరిగింది. ఈ సినిమా విజయంతో త్రివిక్రమ్ తో బన్నీ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు నాలుగో సినిమా చేయడానికి బండి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

allu arjun and Details of icon star Allu Arjun's upcoming movie after Pushpa 2

పుష్ప రెండో భాగం సినిమా తర్వాత బన్నీ బోయపాటితో సినిమా చేయాలని ముందు ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ బోయపాటి బాలయ్య సినిమా పై ఫోకస్ పెట్టడంతో బన్నీ త్రివిక్రమ్ తో చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందట. ప్రస్తుతం త్రివిక్రమ్… మహేష్ బాబు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది కంప్లీట్ అయిన వెంటనే అల్లు అర్జున్ ప్రాజెక్టు స్టార్ట్ చేయనున్నట్లు టాక్. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ అని సమాచారం.


Share

Related posts

Krishna Mukunda Murari: గౌతమ్ పెళ్లి డేట్ నందిని కి ఫిక్స్ చేసిన డేట్ ఒకటే అని తెలుసుకున్న మురారి ఏం చేయనున్నాడు.??

bharani jella

Sri Divya Cute Images

Gallery Desk

స‌క్సెస్ కోసం ప్లాప్ డైరెక్ట‌ర్‌తో

Siva Prasad