సినిమా

vijay deverakonda: శివ నిర్వాణ మూవీలో విజ‌య్ పాత్ర లీక్‌.. ఎగ్జైట్ అయిపోతున్న ఫ్యాన్స్‌!

Share

vijay deverakonda: ఇటీవ‌లె డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జాగ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` చిత్రాన్ని పూర్తి చేసిన టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆ వెంట‌నే `జ‌న‌గ‌ణ‌మ‌న‌` అనే కొత్త ప్రాజెక్ట్‌ను షురూ చేశాడు. ఈ సినిమాను కూడా పూరీ జ‌గ‌న్నాథే డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఇదింకా పూర్తి కాక‌ముందే విజ‌య్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌తో ఓ ల‌వ్ స్టోరీని ప్రారంభించాడు.

ఇందులో స‌మంత హీరోయిన్‌గా న‌టించ‌బోతుండ‌గా.. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. కశ్మీర్ నేపథ్యంలో లవ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా చేసుకుని దీనిని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లో వైభవంగా జరిగింది.

విజ‌య్‌, స‌మంత జంట‌గా న‌టిస్తుండ‌టంతో.. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీలో విజ‌య్ చేయ‌బోయే పాత్ర ఏంట‌నేది లీకై నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. ఇంద‌లో విజ‌య్‌ను శివ నిర్మాణ ఒక బైక‌ర్‌గా చూపించ‌బోతున్నాడ‌ట‌. ఆ పాత్ర చాలా కొత్త‌గా ఉంటుంద‌ని టాక్ న‌డుస్తుండ‌టంతో.. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

కాగా, విజ‌య్‌, స‌మంత‌ జంట‌గా గతంలో `మ‌హాన‌టి` సినిమాలో న‌టించారు. నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో వారు చేసింది చిన్న పాత్ర‌లే అయినా.. ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకున్నారు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి పాత్ర‌ల‌తో అల‌రించేందుకు సిద్ధం అవుతున్నారు.

 


Share

Related posts

Detthadi Harika: నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అన్న యుట్యుబర్ కి దేత్తడి హారిక రిప్లై చూస్తే షాక్..!

bharani jella

బిగ్ బాస్ 4 : నోయిల్ పొగరు దించబోతున్న బిగ్ బాస్ .. కెప్టెన్ అయిన కాసేపటికే షాక్ !

arun kanna

Aishwaryaa Dhanush: వీళ్ల విడాకుల తరువాత అతి పెద్ద సంఘటన .. రజనీకాంత్ కూతురు బాగానే ఉంది, ధనుష్ గుండె పగేలా ఏడుస్తున్నాడు..??

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar