ప్రముఖ నట శిక్షకుడు, నటుడు, దర్శకుడైన దేవదాసు కనకాల అనారోగ్యంతో గురువారం సాయంత్రం కన్నుమూశారు. నాటక రంగంలో నటుడిగా, దర్శకుడిగా ప్రత్యేకతను సంపాదించుకున్న ఈయన సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. 1945 జూలై 30న యానాంలో ఆయన జన్మించారు. యానాంలోని కనకాల పేట ఈయన స్వగ్రామం. తండ్రి తాతయ్య నాయుడు, తల్లి మహాలక్ష్మమమ్మ. ఈయన తనయుడు రాజీవ్ కనకాల ప్రస్తుతం సినిమాల్లో నటుడిగా రాణిస్తున్నారు. ఈయన కుమార్తె పేరు శ్రీలక్ష్మి. గత కొంతకాలంగా ఈయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి కన్నుమూశారు.
previous post
next post