Devatha Serial: ఆదిత్య వాళ్ళ నాన్న, బాబాయ్ ముగ్గురు కలిసి ఉగాది పచ్చడి చేస్తారు.. బతిమాలి బామాలి బెదిరించి వారి భార్యలకు ప్రేమగా ఉగాది పచ్చడి తినిపిస్తారు.. ఇక వారు కూడా ఉగాది పచ్చడి అద్భుతంగా ఉంది అని కితాబు ఇస్తారు.. ఇది మా విజయం కాదు.. మొత్తం మగజాతి అంకితం అంటూ ఫోజులు కొడతారు.. ఒక్క రోజు ఒక్క పూట ఒక్క పచ్చడి చేయడానికి మేము ఇన్ని అవస్థలు పడితే.. రోజు శ్రమించే ఆడవాళ్ళకు జోహార్లు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు..!
రాధా దేవిని అందంగా రెడీ చేసి కిందకి తీసుకు వస్తుంది. ఇప్పుడు ఎందుకు రాధా దేవి చిన్మయి ను ఇలా రెడీ చేసావు అని మాధవ అడుగుతాడు. ఇంకొకసారి ఇలా చేసే అవకాశం వస్తుందో రాదో.. ఏంటి అని అడిగితే.. చదువులు, పెళ్లి అంటూ వాళ్లకు మనకు దూరంగా వెళ్లిపోతారు. అప్పుడు వాళ్ళని ఎలా సంబరంగా చూసుకుని మురిసిపోయే అవకాశం మనకు ఉండదు కదా అని అంటుంది. బిడ్డలిద్దరిని కలిపి ఫోటోలు తీయండి. ఇంకొకసారి ఇలా ఇద్దరినీ కలిపి ఫోటోలు తీయించుకునే అదృష్టం ఉందో లేదో అని అంటుంది. అసలు నీకు ఏమైంది రాదా.. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటినుంచి ఎందుకు బాధ పడుతున్నావ్ అని అంటాడు. రాధ మాటలు వింటున్న ఇంట్లో అందరూ షాక్ అవుతారు. రమ్య రాధకు ఏమైనా పిచ్చి పట్టిందా అని మనసులో అనుకుంటుంది.
ఆదిత్య వాళ్ళ ఇంట్లో పంచాంగం శ్రవణం జరుగుతుంది. అందులో పంతులుగారు మీ ఇంటికి వారసురాలు వచ్చితీరుతుందని.. మీ బాధలు, కష్టాలు తొలగిపోతాయని చెప్పడంతో.. దేవుడమ్మ తన ఇంటికి వారసురాలు వస్తుందన్న ఆనందంలో సంబరపడుతుంది. ఆ వారసురాలు దేవి అని తెలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?