Devatha Serial: ఆదిత్య సత్య బంధం ప్రేమతో ముడిపంది.. అందుకని వాలెంటైన్ డే సందర్భంగా ఆదిత్య స్పెషల్ వాలెంటైన్ డే సర్ప్రైజ్ ను ప్లాన్ చేసింది సత్య.. రూమంతా లవ్ సింబల్స్ తో డెకరేట్ చేయగా.. ఆదిత్య రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే గులాబీల రేకుల జల్లులలో ఆదిత్య వెనుకగా వచ్చి సత్య హత్తుకుని వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతుంది.. సాధారణంగా ఇలా ఏ అబ్బాయిలకైనా ఇలా చెప్పిన హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ.. ఆదిత్య మనసులో దేవి గురించి బాధపడుతూ ఉంటాడు. అందువలన ఆ డెకరేషన్ లైట్ తీసుకుంటాడు. దాంతో కోపం వచ్చిన సత్య మన బంధం ప్రేమతో మొదలై 10 సంవత్సరాలు అయింది. ఈ రోజంతా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుందామని సత్య అంటుంది..!
ఆదిత్య రామమూర్తి గారికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. ఇంట్లోనే ఉన్నానంటే దేవి కి ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. దేవి దగ్గరకు వెళ్లి ఆఫీసర్ ఫోన్ చేశాడని మాట్లాడమని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ల తాతయ్య ఫోన్ తీసుకుని ఏమీ మాట్లాడకుండా ఆదిత్య చెప్పే మాటలను వింటుంది. దేవి నేను నిన్ను బాధ పెట్టే అంత తప్పు ఏం చేశానమ్మ.. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. నువ్వంటే నాకు ప్రాణం. నేను చేసిన తప్పేంటో నాకు చెప్పమ్మా.. నేను అది తప్పయితే తప్పకుండా సరి చేసుకుంటాను అని దేవిని ప్రాధేయపడతాడు. కోపంతో దేవి ఫోన్ కట్ చేస్తుంది.
రాధా ఆదిత్య ను కలవడానికి తన ఆఫీస్ కి వెళ్తుంది రాధా రావడం రమ్య చూస్తుంది. ఆఫీసర్ సార్ తో పిల్లల గురించి మాట్లాడడానికి వచ్చాను అని నీకు చెబుతుంది. సార్ మమ్మల్ని రమ్మంటున్నారు లోపలికి వెళ్ళమని రమ్య చెప్పగానే రాధ లోపలికి వెళుతుంది. రాధా ఆదిత్య కలవడానికి వచ్చిందని రమ్య వాళ్ళ బావ మాధవ్ కి ఫోన్ చేసి చెబుతుంది రమ్య.. అసలు ఆదిత్య తో మాట్లాడిన అవసరం రాధకు ఏముందని మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు. మాధవ్ ఎలాగైనా రాధా అక్కడకు వచ్చి ఆదితో ఏం మాట్లాడిందో తెలుసుకుంటాడో లేదో భాగంలో తెలుసుకుందాం.