Devatha Serial: రాధ మాధవ్ సార్ తో కలిసి అందరి ముందుకు రానని చెబుతుంది.. రామూర్తీ ఈ ఒక్కసారి రమ్మని నా పరువు కాపాడమని వేడుకుంటాడు.. మాధవ్ కూడా ఈ ఒక్కసారి మా నాన్న పరువు కాపాడమని వేడుకుంటాడు.. నీ కోసం కారులో ఎదురుచూస్తూ ఉంటా వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం.. లేదంటే నేను కూడా వెళ్ళను అంటాడు.. ఇక మొత్తానికి రాధ రెడీ అయ్యి వస్తుంది..!
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మాధవ్ పడబోతుండగా రాధ వెళ్లి చెయ్యి అడ్డుపెడుతుంది. అందులో మాధవ్ కావాలని తన చేతి కర్రను విరిగి పోయేలా చేస్తాడు. దాంతో రాధ మీద చెయ్యి వేసి ఊరి అందరి ముందు నడుస్తాడు. కర్ర విరగలేదు రాధా నేనే కావాలని విరిగి పోయేలా చేశాను.. నేనంటే ఇష్టం లేకపోతే నువ్వు నన్ను కాపాడవు కదా అంటే.. నేను పడిపోతాను అంటే నువ్వు నన్ను కాపాడావు నాకు ఏమాత్రం క్లారిటీ చాలు అని మనసులో అనుకుంటడు మాధవ్..
నేనేమో ఆ ఇద్దరు పిల్లలు ఎవరు నా బిడ్డో తెలియకుండా సతమతమవుతుంటే.. మీరు మాత్రం ఊరిలో పెళ్లిళ్లు జరిపిస్తారా.. నేరుగా ఈ విషయాన్ని రాధతో తేల్చుకోవాలని ఆదిత్య గుడి దగ్గరకు వస్తాడు. ఆదిత్య రాధ తో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి గర్భవతివి అంటే చిన్మయి నా కూతురా లేదంటే దేవినా అని ఆదిత్య అడుగుతాడు ఆదిత్య.. రాధా అసలేం జరిగిందంటే అని నిజం చెప్పబోతుండగా మాధవ్ వచ్చి అడ్డుపడతాడు. ఇలా ఊరి అందరి ముందు నువ్వు ఆదిత్య తో గుడిలో మాట్లాడటం చూస్తే.. అందరూ ఏమనుకుంటారు అని అంటాడు మాధవ్.