Devatha Serial: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో దేవత సీరియల్ కూడా ఒకటి..! ఈ బుల్లితెర ధారావాహిక అనుబంధాలకు నిలయం.. ఆప్యాయత, అనురాగాలు మధ్య ఈ సీరియల్ నడుస్తుంది.. చక్కటి కథనంతో సరికొత్త మలుపులతో ప్రేక్షకులను అలరిస్తోంది.. ఈ వారం జరిగిన విశేషాలతో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!
రాధ దేవిని ఆదిత్య కు దత్తత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయం రాధ ద్వారా మాధవ్ కు తెలుస్తుంది. మాధవ్ దేవిని దత్తత ఇవ్వడానికి ఒప్పుకోడు. ఆ విషయం తెలుసుకున్న మాధవ్ లోలోపల బాధపడతాడు. రాధ ను తన నిర్ణయం మార్చుకోమని చెబుతాడు. ఇక దేవి కోసం ఆదిత్య తన స్థాయిని మరిచిపోయి తన ఆఫీసర్ ఉద్యోగంలో తన కూతురిని కూర్చోబెట్టి మురిసిపోతాడు. కూతురి కోసం తనే ప్యున్ గా మారతాడు. ఈ విషయాలు తెలిసిన రాధ దేవిని ఆదిత్య సార్ నిన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నారో కదా.. తనతో పాటే వాళ్ళ ఇంట్లో ఉంటావా అని అడుగుతుంది. ఉందనని దేవి చెబుతుంది.
రాముర్తి తన ఆస్తిని దేవి, చిన్మయి కి రాస్తున్నాం అని చెబుతాడు రాధకు. దేవికి ఏ అస్తి వద్దు తనని ఆ ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంటికి దత్తత పంపుతాను అని చెబుతుంది. దాంతో వాళ్ళు షాక్ అవుతారు. రాధ నిర్ణయం కు ఇంట్లో అందరూ కట్టుబడి ఉండే పరిస్థితి వస్తుంది. రాధ అనుకుంటునట్టుగా దేవిని వాళ్ళ నాన్న ఆదిత్య కు దత్తత ఇస్తుంది. ఆ విషయం తెలిసిన దేవుడమ్మా, సత్య ఒప్పుకోరు.. ఇదే నెక్స్ట్ వీక్ హైలైట్ సీన్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?