Devatha Serial: ఆదిత్య స్కూల్ దగ్గర రాధ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.. రాధ రాగానే తన బిడ్డను తనకు ఇవ్వమని అడుగుతాడు.. రాధ ససేమిరా ఇవ్వనని చెబుతుంది.. నేను చెప్పేది అని రాధ అంటుంది.. నువ్వు మాట్లాడితే నేను కన్విన్స్ అయిపోతాను.. అందుకని నేను నీ మాటలు వినను.. నాకు నా బిడ్డ కావాలి అని.. వీళ్ళిద్దరూ మాట్లాడు కోవటం చూసిన దేవి.. మరోసారి ఆదిత్యను తప్పుగా అనుకుంటుంది దేవి..!
ఆదిత్య నీ అంతటికి నువ్వే దేవిని నాకు అప్పగిస్తే ఓకే.. ఇవ్వకపోతే మాత్రం నేనే మీ ఇంటికి వచ్చి.. దేవి నా కన్నబిడ్డ అని అందరి ముందు చెప్పేసి.. దేవిని నీ దగ్గర నుంచి నేను తీసుకు వెళ్ళి పోతాను.. నీ అంతట నువ్వు చెబితే సరే.. లేకపోతే ఏం చేయాలో నేను చూసుకుంటాను అని అంటాడు. ఆదిత్య మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది రాధ.. దేవికి ఈ నిజం చెప్పాలి.. ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ఆఫీసర్ మా నాయన అని.. ఇన్ని రోజులు నుంచి ఎందుకు చెప్పలేదు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి.. నా గురించి దేవి తప్పుగా అనుకుంటే.. నేను ఏమని తనకు చెప్పాలి.. ఏమీ పాలుపోవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా దేవికి నిజం అయితే చెప్పాలి అని అనుకుంటుంది.
రాధా ముగ్గేస్తు ఉండగా రమ్య వచ్చి ఆఫీసర్ ఫోన్ చేశారు అని ఇస్తుంది. స్కూల్ దగ్గరకు నిన్ను రమ్మన్నారని చెబుతుంది. ఇక స్కూల్ దగ్గరికి వెళ్లిన రాధ దేవిని తీసుకొని రాలేదని తెలిసి.. రాధ ఇంటికి వెళ్ళడానికి ఆదిత్య కోపంగా బయలుదేరుతూ ఉండగా.. దేవి మీ గురించి తప్పుగా ఆలోచిస్తుంది.. మీరు దేవి కోసం కాదు నా కోసమే ఇక్కడికి వస్తున్నారు అని అనుకుంటుందని చెప్పేస్తుంది.. రాధ మాటలు విన్న ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు.. అసలు ఏం చేయనున్నాడో.. రేపటి భాగంలో తెలుసుకుందాం.