Devatha Serial: దేవి దత్తత విషయంలో రాధ నిర్ణయం మార్చుకోనని చెబుతుంది.. చిన్మయి బాధపడకుండా.. చిన్మయికి అమ్మ, నాన్న, అక్క, స్నేహితుడు అన్నీ తానే అయి పెంచుకుంటానని రాధ అంటుంది.. దేవిని దత్తత విషయంలో నా నిర్ణయం మార్చుకోను. ఆఫీసర్ కి మాట ఇచ్చాను. మాట తప్పను అని ఖరాఖండిగా చెబుతుంది రాధ..
రాధ నిర్ణయం విన్న రామ్మూర్తి, జానకమ్మ ఇక ఆ విషయంలో రాధాను మార్చలేమని అనుకుంటారు. ఈ విషయంలో ఆదిత్యతో రామ్మూర్తి కూడా మాట్లాడలేరు. మాధవ్ ఈ విషయాన్ని ఆదిత్యతో కాకుండా వాళ్ళమ్మ దేవుడమ్మ తో మాట్లాడి తేల్చుకోవాలని ఐడియా ఇస్తాడు. ఇక అదే సరైన నిర్ణయమని రామ్మూర్తి, జానకమ్మ ఇద్దరూ ఆఫీసర్ సార్ వాళ్ళ ఇంటికి బయలు దేరుతారు. ఆ విషయం తెలిసిన రాధా అడ్డుపడుతుంది. రాధను తప్పుకోమని వాళ్ళిద్దరు దేవుడమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు.
రాధ ఆదిత్య కు ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. ఏంటి అంత కంగారుగా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు.. ఇక్కడ ఘోరం జరిగిపోతుంది. ఏమైంది ఎన్ని చెప్పినా దేవిని దత్తత ఇవ్వాల్సిందే అని పట్టుబట్టానని.. దేవి వాళ్ళ అవ్వ తాత అత్తమ్మ తోని మాట్లాడి తేల్చుకుంటామని మీ ఇంటికి వచ్చారు.. ఏంటి రుక్మిణి.. నేను చెప్పేది వద్దన్నా వినకుండా మీ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్లి అత్తమ్మ తో ఏం మాట్లాడుతారో ఏమో అని భయంగా ఉంది. నువ్వే వాళ్లు అత్తమ్మ దగ్గర ఏమీ మాట్లాడకుండా చూసుకోవాలి..