ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్య కు దిమ్మతిరిగే షాక్.. దేవి ప్రశ్నలకు రాధ సమాధానం ఏంటి..!? 

Share

Devatha Serial: రాధా ఫోన్ చేసిందని ఆదిత్య చాలా స్పీడ్ గా ఇంటికి వెళ్తాడు.. అప్పటికే రామ్మూర్తి, జానకమ్మ ఇద్దరు అక్కడికి ఎందుకు వచ్చారో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. వాళ్ళు దేవి దత్తత విషయం చెప్పకుండా ఆదిత్య అడ్డుపడతాడు. మీ అబ్బాయి నన్ను తిట్టాడని నేను బాధ పడతానని.. మా ఇంట్లో వాళ్ళు బాధ పడతారని మాకు నచ్చచెప్పడానికి మీరు ఎంత దూరం వచ్చారా అంటూ.. మేము దాని గురించి బాధపడం అంటూ అక్కడి నుంచి వాళ్ళను తీసుకొని బయటకు వచ్చేస్తాడు..!

Devatha Serial: 16 Apirl 2022 Today Episode Highlights
Devatha Serial: 16 Apirl 2022 Today Episode Highlights

వాళ్లను బయటికి తీసుకు వచ్చి మీరు మా అమ్మతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు నాకు తెలుసు మా అమ్మ అ ఇలాంటి విషయాలను తట్టుకోలేదు అందుకే మిమ్మల్ని బయటికి తీసుకు వచ్చాను దేవి దత్తత ఇవ్వడం మాకు ఇష్టం లేదు అని రామ్మూర్తి జానకమ్మ చెబుతారు దేవిని మిమ్మల్ని ఒప్పించిన తర్వాత నేను దత్త తీసుకుంటాను అని ఆదిత్య అంటాడు ఈ విషయంలో మాత్రం మీరు ఆశలు వదిలేసుకోండి సార్.. మేము మా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న దేవిని ఇవ్వము గాక ఇవ్వము అని చెప్పేస్తారు..

 

నువ్వు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటే మాజాక్ చేస్తున్నావ్ అనుకున్నాను.. నేను వెళ్లి పోతే నువ్వు ఎట్లా ఉంటావు అని అడుగుతుంది.. లే బిడ్డ నిన్ను ఆఫీసర్ సారూ మంచిగా చూసుకుంటారు.. అందుకే పంపిస్తున్నా అంటూ దేవికి రాధ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నువ్వు కూడా మంచిగానే చూసుకుంటున్నావూ కదా.. నాన్న, తాతయ్య, అవ్వ అందరూ మంచిగానే చూసుకుంటున్నారు కదా.. నేను ఎందుకు పోవాలి అని అడుగుతుంది. చెప్పు రాదా మా అందరికి సమాధానం చెబుతున్నారు కదా.. ఇప్పుడు దేవినే అడుగుతుంది తనకి సమాధానం చెప్పు అని మాధవ్ అంటాడు.. ఇక ఆ ముచ్చట రేపటి భాగంలో తెలుసుకుందాం.


Share

Related posts

రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు

somaraju sharma

ఆ టీడీపీ నేత ఎక్కడ? వైసీపీ అతని కథ ఎప్పుడో ముగించేసింది?

siddhu

Megastar: మెగా ఫ్యాన్స్‌కు బంగారం లాంటి వార్త..చిరంజీవి సినిమాలన్ని వరుసగా రిలీజ్..!

GRK