ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: అమ్మకు అమ్మైన దేవి..! రాధ నిర్ణయం మార్చుకుందా..!? 

Share

Devatha Serial: మాధవ్ వాళ్ళ అమ్మ నాన్నలు ఇంటికి రాగానే ఈ ఏమైంది. ఆ ఆదిత్య వాళ్ళ అమ్మ ఏమంది అని అడుగుతాడు. మేము సరిగ్గా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో చెబుతుండగా ఆదిత్య అక్కడికి వచ్చాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడనీవ్వకుండా మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు.. ఆఫీసర్ బాబుకి ముందుగానే మేము వచ్చిన విషయం తెలిసినట్టు ఉంది. అందుకే ఆమె తో మాట్లాడకుండా మాకు అడ్డుపడ్డాడు. ముందుగానే చెప్పాను కదా నేను వస్తాను అని మాధవ్ అంటాడు. నేను వచ్చి ఉంటే మరో లాగా ఉండేది అని అంటాడు మాధవ్. ఆఫీసర్ బాబుకి అన్నీ గట్టిగా చెప్పు వచ్చాము. దేవిని దత్తత ఇవ్వడానికి కుదరదు అని చెప్పావు అని అంటారు..

Devatha Serial: 18 Apirl 2022 Today Episode Highlights
Devatha Serial: 18 Apirl 2022 Today Episode Highlights

చిన్మయి పరుగు పరుగున వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునుంటుంది. ఈరోజు నాకు ఇష్టమైన కూర చేసావ్ అమ్మ థాంక్యూ అంటూ పళ్లెంలో అన్నం కలుపుతుంది. అందరూ మౌనంగా అదోలా ఉండటంతో ఏమైంది ఎవరు అన్నం తినటం లేదు అంటుంది. ఏం కాలేదు వాళ్ళు ఇప్పుడు అన్నం తింటారు చూడు అని రాధా అందరికీ కళ్ళతో సైగ చేస్తుంది తినమని.. ఇక మాధవ్ వాళ్ళ అమ్మ భోజనం చేస్తారు. దేవిని తిను అంటే ఎప్పుడు నువ్వే తినిపిస్తావు కథ అని అంటుంది. రాధా దేవి చిన్మయికి అన్నం కలిపి వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ కూడా రాథకు అన్నం తినిపిస్తారు.

అమ్మకు అమ్మై దేవి రాధకు అన్నం తినిపిస్తుంది. పొద్దున్నుంచి ఇంట్లో పనిచేసే అలిసిపోయారు పొద్దున కూడా అన్నం తినలేదు అంటూ దేవి రాధకు అన్నం తినిపిస్తుంది. అమ్మ నేను ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించు నన్ను కొట్టు తిట్టు అంతేగానీ నన్ను దూరంగా పంపించకు. ఇంట్లో గొడవ చేయను చాక్లెట్లు బిస్కెట్లు కావాలని అడగను. ఈరోజు నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. నన్ను ఎక్కడికి పంపించ్చకు అని దేవి అంటుంటే రాధా కళ్లల్లో నుంచి నీళ్లు కారిపోతాయి.. నువ్వు ఏ తప్పు చేయలేదు బిడ్డ. నిన్ను ఆఫీసర్ దగ్గరికి పంపించేది నువ్వు మంచిగా ఉండాలనే.. నీ బ్రతుకు బాగుంటుంది అందుకే ఆ ఇంటికి పొమ్మంట్టున్నాను. నువ్వు కనిపించకుండా అగమయ్యాడు. మాట్లాడక పోతే పసిబిడ్డ లాగా మారి నన్ను బ్రతిమాలాడు.. నిన్ను నాకంటే బాగా చూసుకుంటాడు.. నా మాట విను బిడ్డా అని రాధ దేవితో చెబుతుంది. ఇక దేవి ఏం ముచ్చట చెబుతుందో రేపు చూద్దాం.


Share

Related posts

Harshika Poonacha Traditional Looks

Gallery Desk

Skipping breakfast: బ్రేక్ ఫాస్ట్ తినకుండా మానేస్తున్నారా? అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాలిసిందే!!

Naina

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో సన్నీ.. దిశా దశ మార్చిన సంఘటన..!!

sekhar