ట్రెండింగ్ సినిమా

Devatha Serial: ఆదిత్య దగ్గరకు వెళ్లనన్న రాధ.. మాధవ్ రాధ తలలో పూలు పెట్టాడా..!?

Share

Devatha Serial: రాధా నేను నిన్ను ఒక విషయం అడగాలి.. ఈరోజు ఆదిత్య దేవిని కావాలి అంటున్నాడు.. రేపటి రోజున నిన్ను కూడా కావాలి అంటే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతాడు. ఒకసారి ఒక దారిలో నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి అని ఎవరు అనుకోరు.. నేను కూడా అంతే.. ఈ జీవితంలో ఇంక ఎప్పటికీ ఆదిత్య దగ్గరకు వెళ్ళను అని అంటుంది రాధ.. దాంతో మాధవ్ ఆనందంతో థాంక్యూ రాధా అంటూ సంతోషంగా అక్కడనుంచి వెళ్ళిపోతాడు..!

Devatha Serial: 2 May 2022 Today Episode Highlights
Devatha Serial: 2 May 2022 Today Episode Highlights

రాధ పిల్లలందరికీ గోరింటాకు పెట్టి తను కూడా పెట్టుకుంటుంది. ఇక జానకమ్మ కూడా గోరింటాకు పెట్టుకుంటుంది. అంతలో మాధవ్ మన తోటలోని మల్లేపూలు తీసుకు వచ్చానని వాళ్ళ అమ్మను పెట్టుకోమని ఇస్తాడు.. జానకమ్మ తన భర్త రముర్తీ నీ తన తలలో పూలు పెట్టమని చెబుతుంది. దేవి వాళ్ళ అవ్వతో నీ తలలో తాత పూలు పెట్టిందాకా గొడవ చేసావు కదా.. మరి మా అమ్మ కూడా గోరింటాకు పెట్టుకుంది కదా.. మరి నువ్వు మా నాన్నను మా అమ్మకు పెట్టమని చెప్పు.. అవును నాన్న అమ్మకి పూలు పెట్టాలని దేవి, చిన్మయి అంటారు. ఆ మాటలకు రాధ కోపంగా మాధవ్ సార్ వంక చూస్తుంది. ఇక మాధవ్ పూలు పట్టుకుని రాధ దగ్గరకు వస్తాడు.. ఇక రాధ కోపంతో పైకి లేచి నాకు వద్దులే కానీ.. పిల్లలకి పెట్టండి అని అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది.

చిన్మయి దేవికి అన్నం తినిపిస్తుంది. అది చూసిన దేవి అవ్వ, తాత, మాధవ్ అందరూ సంబరపడతారు. చూసావా రాదా పిల్లలు ఒకరి నుంచి ఒకరికి దూరం చేస్తే ఉండలేను అని అర్థమైంది కదా అంటారు. ఆ ఆదిత్య బాబు దేవిని దత్తత తీసుకొనని చెప్పి మంచి పని చేసాడు అని అంటుంది జానకమ్మ.. ఆదిత్య చెప్పాడు కానీ రాధ మనసులో దేవిని దత్తత ఇవ్వాలని ఉందని.. తనకు మన ఇంట్లో వారి సంతోషం కంటే ఆ ఆదిత్య కుటుంబం సంతోషం ఎక్కువ అని మాధవ్ రాధను అంటాడు.


Share

Related posts

తేజ కి తిప్పలు తప్పడం లేదా ..సాయి పల్లవి ఏమంటుందో ..?

GRK

బాలయ్య రికార్డులు తిరగరాయడం మొదలు పెట్టాడుగా ..!

GRK

`ఆర్ ఆర్ ఆర్‌`లో బాహుబ‌లి – దేవ‌సేన‌

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar