ట్రెండింగ్ సినిమా

Devatha Serial: వామ్మో రాధకి మాధవ్ అంటే ఇంత ఇష్టమా.. తనకోసం ఏం చేసిందంటే..!?

Share

Devatha Serial: దేవి చిన్మయి ఇద్దరూ చెరో బెలూన్ తీసుకుని.. వాళ్ల నాన్న మాధవ్ దగ్గర కు వెళ్లి బెలూన్ బ్రేక్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి సర్ప్రైజ్ గా చేస్తారు.. అంతలో రాధ కూడా వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు మాధవ సార్ అని చెబుతోంది.. త్వరగా స్నానం చేసి రండి.. మీ పుట్టినరోజు అని కొత్తబట్టలు తెప్పించాను.. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాధ..!

Devatha Serial: 22 Apirl 2022 Today Episode Highlights
Devatha Serial: 22 Apirl 2022 Today Episode Highlights

రాధ ఇల్లంతా డెకరేట్ చేస్తుంది. అది చూసిన మాధవ్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ ఇల్లు చూసి షాక్ అవుతారు. ఈరోజు మాధవ సార్ పుట్టిన దినం మీరు ఏంది ఇంకా ఇట్లనే ఉన్నారు. త్వరగా రెడీ అయ్యి రండి అని చెబుతోంది. మాధవ్ రెడీ అయి వస్తారు. సార్ కి ఈ బట్టలు నేనే తీసుకున్న బాగున్నాయా అని అడుగుతుంది వాళ్ళమ్మ నాన్నలను రాధ. రాధలో ఈ మార్పు చూసి ఇంట్లో అంతా షాక్ అవుతారు. దేవుడికి పూజ చేసి హారతి ఇస్తుంది చిన్మయి, దేవి లకు రాధె హారతి అద్దుతుంది. మాధవ్ హారతి తీసుకొబోతుండగా రాధ మాధవ్ కి హారతి అద్దుతుంది. అది చూసిన మాధవ్ వాళ్ళ అమ్మనాన్న హ్యాపీ గా ఫీల్ అవుతారు. చిన్మయి, దేవి ఇద్దరూ మాధవి పాయసం తినిపిస్తారు. అమ్మ నువ్వు కూడా తినిపించు అని అంటారు. రాధా స్పూన్ తో పాయసం తీసి మాధవ్ కి ఇస్తుంది.

 

రాధలో ఈ మార్పు గమనించిన మాధవ్.. రాధ దగ్గరకు వెళ్లి నువ్వు ఈరోజు ఇంత సంతోషంగా నా పుట్టినరోజు చేయడానికి కారణం.. నేను ఆదిత్యకు దేవిని దత్తత ఇవ్వడానికి ఒప్పుకున్నాను అనే కదా. మీ అందరికీ ఆదిత్య మీద లేని కోపం నాకెందుకు.. ఈరోజు సాయంత్రం ఫంక్షన్ కు ఆదిత్యను కూడా రమ్మని చెప్పు. దేవినీ దత్తత ఇస్తున్న విషయం స్వయంగా నేనే ఆదిత్య తో చెబుతాను అని మాధవ్ అంటాడు. ఆదిత్యతో మాట్లాడమని కాల్ చేసి ఇస్తాడు. రాధ ఆనందంతో ఆదిత్య ను ఫంక్షన్ కి పిలుస్తుంది..


Share

Related posts

వెంక‌టేశ్ చిత్రంలో బాలీవుడ్ స్టార్‌

Siva Prasad

Mugguru Monagallu: ముగ్గురు మొనగాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్..!!

bharani jella

జగన్ పాలించే విధానం భేషుగ్గా ఉంది .. కానీ అదే బిగ్ మైనస్ !

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar