Devatha Serial: రుక్మిణీ పాప ఎలా ఉందన్న ఆదిత్య.. దేవి తన బిడ్డ కాదని తెలుసుకున్న ఆదిత్య..!

Share

Devatha Serial: రాధ దగ్గరకు వచ్చి దేవి నన్ను క్షమించమని అడుగుతుంది.. నువ్వు మా అమ్మవు కాకపోయినా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నావు.. అని అనగానే రాధ మనసు ముక్కలు అవుతుంది.. ఏమైంది దేవమ్మ ఇలా మాట్లాడుతున్నావు.. నా నుంచి నిన్ను దూరం చేయాలని ఈ మాటలన్నీ నీకు ఎవరో చెబుతున్నారు.. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటూ రాధా ఏడుస్తుంది..

Devatha Serial: 23 May 2022 Today Episode Highlights

రాధా ఆదిత్య పిలిచాడని తన దగ్గరికి వెళుతుంది.. ఏంది పెనిమిటి పిలిచావు అని అడుగుతుంది రాధ.. అమ్మకు నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసింది. నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెబుదామని పిలిచాను అని అంటాడు. సచ్చిపోయిన నన్ను వదిలేయకుండా ఇంకా ఎందుకు నా గురించి ఆలోచిస్తున్నారు అని అంటుంది రాధ. మనిషి దూరమైన నా మనసుకి దగ్గరగా ఉంటారు అని ఆదిత్య అంటాడు. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపో వద్దు అక్కడే ఉండు అన్నట్టుగా నాకు అనిపించింది. ఏదో విషయం గురించి బాధపడుతున్నావు.. అది ఏంటో నాకు చెప్పు అని అంటాడు ఆదిత్య. నా బాధ కూడా నీకు తెలుస్తుందా పెనిమిటి అని అంటుంది రాధ.. అంటే నువ్వు బాధ పడుతున్నావు కదా అని అంటాడు ఆదిత్య. ఆ బాధ ఏంటో నాకు చెప్పు అంటే.. ఆ విషయాలు నీకు చెప్పుకోలేను చెప్పే సమయం కూడా కాదు.. ఆ సమయం వస్తే మొదట కచ్చితంగా నీకే చెబుతాను అని రాధా అక్కడినుంచి వెళ్ళిపోతుండగా.. రుక్మిణి పాప ఎలా ఉంది అని అడుగుతాడు. బాగుంది అని చెప్పి ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రాధ.

దేవి స్కూల్ కి వెళ్ళకుండా బయట ఎక్కడో కూర్చుని ఉండడం అటుగా వెళుతున్న దేవుడమ్మ చూస్తుంది. తను ఆదిత్య ని చూస్తే నువ్వు చాలా సంతోషిస్తామని ఇక్కడికి తీసుకు వచ్చాను అని అంటుంది. దేవుడమ్మ తన ద్వారా తెలుసుకున్న నిజం తెలుసుకొని ఆదిత్య తో రాధ తన సొంత అమ్మ కాదని బాధపడుతుంది అని చెబుతుంది. ఈ విషయం నీకు ఎవరు చెప్పారమ్మా అంటే దేవి చెప్పింది అని చెబుతుంది. ఆ మాట వినగానే ఆదిత్య షాక్ అవుతాడు..


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

24 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago