Devatha Serial: దేవినీ దేవుడమ్మ తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్తుంది.. అప్పటివరకు మోనంగా ఉన్న దేవి ఆదిత్య రాగానే ఆఫీసర్ అంటూ తన దగ్గరికి వెళుతుంది.. ఆదిత్యతో పాటు ఆటలు ఆడుతుంది.. కబ్బడ్డి ఆట ఆడుతుండగా ఆదిత్య అమ్మను పట్టుకో అని అంటాడు. అమ్మా అని పేరు వినగానే దేవి మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోదాం ఇంటికి అని అంటుంది.. దేవుడమ్మ తనను ఇంటికాడ దింపివస్తాను అని చెబుతుంది..!
రాధ మాధవ్ దగ్గరకు వెళ్లి దేవి మనసులో లేనిపోని మాటలు ఎందుకు సృష్టిస్తున్నారు అని అడుగుతుంది. నేను దేవిని ఇప్పుడే ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోతాను అని అంటుంది. దేవి నీతో పాటు రావాలి కదా అని మాధవ్ అంటాడు. చూడండి సారు ఇప్పటివరకు మీరు రాదనే చూసారు.. నన్ను నా బిడ్డని ఆదరించి అన్నం పెట్టినందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను కానీ.. మీరు నా బిడ్డను నాకు దూరం చేయాలి అనుకుంటే మాత్రం రుక్మిణీ అంటే ఏంటో మీరు చూస్తారు. రుక్మిణీ బయటకు వస్తే మీరు తట్టుకోలేరు సార్ జాగ్రత్త అని మాధవ్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాధ..
దేవుడమ్మ ఇంటికి తీసుకు వెళ్తూ మధ్యలో ఒక చోట కార్ ఆపి తనకు స్వీట్స్ తినిపిస్తుంది. ఇప్పటికైనా చెప్పమ్మా దేవి నీ మనసులో ఉన్న బాధ ఏంటో అని అడుగుతుంది. కనీసం మీ అమ్మ కైనా చెప్పుకో అని అంటుంది. నాకు అమ్మ లేదుగా అని అంటుంది దేవి. అదేంటమ్మా మీ ఇంట్లో రాధా ఉంది కదా అని అంటే తను మా అమ్మ కాదు. మా చిన్నప్పుడు చచ్చిపోయింది అని చెబుతుంది. దేవి సరే నువ్వు ఇంట్లోకి వెళ్లి మీ అమ్మని రమ్మని చెప్పు నేను మీ అమ్మ తో మాట్లాడాలి అని అంటుంది దేవుడమ్మ.
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…